ఎవరిని నమ్మాలి

ఎవరిని నమ్మాలి

కని పెంచిన అమ్మా-నాన్నను
నమ్మకు తప్పదు ఓ మనిషీ.
తోడ బుట్టిన వారందరినీ
నమ్మవలసిందే ఓ మనిషీ.
మీ స్నేహితుల మాటలను నమ్మక తప్పదు ఓ మనిషీ.
ప్రాణమిచ్చిన దేవుని పైన
విశ్వాసం ఉంచరా ఓ మనిషీ.
విద్య నేర్పిన గురువును నమ్మాల్సిందే ఓ మనిషీ.
మీ కుటుంబ సభ్యులను
నమ్మక తప్పదు ఓ మనిషీ.
తెలియని వారిని నమ్మితే
తిప్పలు తప్పవు ఓ మనిషీ.
చేతులు కాలాక ఆకులు
పట్టుకుంటే లాభం లేదురా
ఓ మనిషీ.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *