ఎవరతను

ఎవరతను

దేవాలయాలకై దేెశయాత్ర చేస్తాడతను
దేహమే దేవాలయమంటే
ఒప్పుకోడు!

అద్వైతమే తన మతమంటాడు
తనలోనే పరమాత్మ ఉన్నాడంటే
ఛస్తే ఒప్పుకోనంటాడు!

పాతొకరోతని చెబుతుంటాడు
పాత వస్తువులనే ప్రేమిస్తాడు
అది పురాణమైనా ,పికిల్ అయినా!

ఆరోగ్యమే సంపదని ప్రవచిస్తాడు
సంపదనే ప్రేమిస్తాడు
ఆరోగ్యం పోయి సంపదే మిగిలింది!

పదిమందికి వసుధైక కుటుంబం
గురించి బోధిస్తాడు
మనసంతా తను, తన కుటుంబమే!

భిన్నత్వంలో ఏకత్వం మన బాటంటాడు
ఆచరణలో భంగపరుస్తుంటాడు!

ఎవరయ్యా అతను ?
బెంగపడకండి
అతను మన అంతర్గత మిత్రుడే అయుంటాడు
తరచి చూస్తే!

సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *