తిరుమల గీతావళి
పల్లవి
నిను తలచని నేను
లేనే లేను
నీ పిలుపుకు మేను
పులకించేను
చరణం
నీ పలుకు మాకు
అండ దండ
నిను చూస్తే చాలు
నీరసమే లేదు
నీ స్మరణే చాలు
భయమే లేదు
కలియుగము లోనా
కాపాడేవాడా
చరణం
తిరుమల గిరులు
మాకేమో ఊపిరి
ఆనందనిలయుడు
ఆదుకునే దేవుడు
నీ చల్లని నవ్వే
మాకేమో కానుక
నీ నీడన ఉంటే
మాకేమి కాదుగా
– సి.యస్.రాంబాబు