ఏమీ అనుకోకు
పరుగు పందెంగా మారిన జీవితంలో
ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంటాం
నీ చిన్మయమూర్తి
మేము నేలపై నిలబడటం అవసరమన్న సత్యాన్ని గుర్తుచేస్తుంది!
మనిషే మనిషిని దోచుకుంటుంటే
నీ బోధనలు
వినే తీరికలేని మాకు కనువిప్పు కలిగేనాటికి
కాలం కరిగిపోయి మాకు కాలం చెల్లిపోవచ్చు!
మము మన్నించి మార్గం చూపవా అన్న వినతి ఒక్కటే మిగిలింది
ఈ ఆలోచన మాలో కలిగేనో లేదో కాలానికి ఎరుక
మనుషులం కదా నువ్వంటే చిన్నచూపు ఏమీ అనుకోకు తథాగతా
– సి.యస్.రాంబాబు