డబ్బు పిచ్చి
ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి ఆ అబ్బాయి పేరు మహేష్. వాళ్ళ నాన్న కూలి పనులు చేసి సంపాందించిన డబ్బుతో కష్టపడి తన కొడుకుని చదివించేవాడు.
అలా జీవితం కొనసాగిస్తూ ఉన్న వాళ్ళ జీవితం అనుకోకుండా ఒక మలుపు తిరిగింది. ఒక కోటీశ్వరుడు వీళ్ళ పేదరికం చూడలేక వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఆశతో వీళ్ళకి అన్ని వసతులు భోగ భాగ్యాలు అన్ని కలిపిస్తాడు.
అక్కడ అతని స్వార్థం కూడా ఉంది అదేంటంటే అతను ఎంత కోటీశ్వరుడు అయిన అతనికి సంతానం లేదు. ఆ కారణంగా మహేష్ ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అలా దత్తత తీసుకుని తన ఆస్తి మొత్తానికి వారసుడిని చేసిఆ కోటీశ్వరుడు చనిపోతాడు.
తన భార్య భర్త చనిపోవడం చూసి అనారోగ్యంతో మంచాన పడుతుంది.
అలా వారసుడు అయ్యాక మహేష్ అంత డబ్బు చూశాక ఆశ పుడుతుంది. ఇంకా కావాలనే ఆశతో డబ్బు పిచ్చి ఎక్కడికో తీసుకెళ్తుంది. అనేక రకాల వ్యాపారాలు పెట్టీ మోసపోతాడు.
ఇక్కడితో కథ ముగుస్తుంది.
– భరద్వాజ్