హృదయ వేదన
మితృలతో బాధ పంచుకుంటే హృదయ వేదనే ఉండదుగా.
మనిషికి మనిషి తోడుంటే
బ్రతుకున కష్టాలన్నీ తీరునులే.
హృదయానికి గాయం అయితే
దానికి మందు ప్రేమే సుమా.
ప్రేమ భావనలు మనసులో
నింపే తోడొకటే చాలునుగా.
ఒంటరి మనిషితో తుంటరి
మనసు ఆటలాడుతుంది కదా.
తుంటరి మనసు రేపే హృదయ
వేదనను ఆపే తోడు కావాలిరా.
తోడుకై వెతికే ఓపిక నీకుంటే
ఆ కోరిక తప్పక తీరునులే.
హృదయానికి గాయం అయితే
దానికి మందు ప్రేమే సుమా.
-వెంకట భానుప్రసాద్ చలసాని