దారి
కొత్త దారి అవకాశాల కోసం ఎదురుచూసే వాడికి సమయం సరి కొత్త దారి…
ఆశ కోసం ఎదురుచూసేవాడికి దొరికే క్రొత్తదారి…
మధ్య తరగతి బ్రతుకులకు మనస్సే మంచిదారి…
చదువుల కోసం ఆరాటపడే వారికి అందెను శిఖరపు అంచు దారి…
మనసు లేని మూర్ఖులను ముంచు దారి ఎడారి….
ఆలోచన తోడైతే ఆనందమే మనకు మంచిదారి…
సీత అన్వేషనలో అంజనేయుడు చూపిన క్రొత్తదారి…
నరకాన్ని నరికి నరకచతుర్థిగా మారిన దారి…
పండగ పరవళ్ల దారి….
పేదవాడి పస్తులకు ఏది దారి?..
వారి కథ ఏ తీరం చేరిది?…
కిషాన్ కి నాగాళి దారి…
జవాన్ కు ఫిరంగి దారి…
వైద్యుడకు స్టెతస్కోపు దారి..
ఇంజనీరికి ఇటుక దారి…..
ఇలా పలు రంగాల ప్రయాణాన మానవుడి కదలికలే కొత్త దారి…
రేపటి తరాలకు సరికొత్త పునాది…
– తోగారపు దేవి