కరోనా ఆటవెలదులు
1) లాకుడౌను వల్ల లాసైన దేశము
రెండవ అలవల్ల రెంటజెడెను
గుర్తు పట్టనంత గుట్టుగా వ్యాపించి
కాటికంపు చుండెగా కరోన
2) చాపకింద నీటిచందాన దరిజేరి
ఆనవాలు లేక అంటుకొనును
సబ్బుతో కరములను శుభ్రంగ కడగాలి
కాదు కూడదంటె కలుగు ముప్పు
3) చేతులెత్తి మొక్కు షేకుహాండివ్వకు
దరికిబోయి దాన్ని తగులుకోకు
మరల తిరిగి వచ్చె మాయదారి కరోన
మాస్కు బెట్టి దాన్ని మట్టుబెట్టు
4) భౌతికముగ ఎడము పాటించి తీరాలి
ఒరుసుకుంటు తిరుగ ఒంటికంటు
ఎడము ఉండవలెను ఏ జనమెదురైన
లెక్క జేయకుంటె ప్రక్క జేరు
– కోట పెంటయ్య
మీ రచన బాగుంది.