చిట్టి ప్రేమ కథ
10th ఎక్జాంస్ అయిపోయాయి. రిజల్ట్స్ కూడా వచ్చాయి అన్నీ పాస్ అయ్యాను… ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అవ్వాలి.. అయ్యో నా పేరు చెప్పడమే మర్చిపోయాను… నా పేరు రవి. మా ఇంటి నుండి కాలేజికి చాలా దూరం ఉండేది ఒక గంట ప్రయాణం చేస్తే గానీ కాలేజికి వెళ్ళేవాడిని కాదు. కాని ఆ సమయానికి బస్సు లు ఉండేవి కాదు. బస్సులు ఉన్నప్పుడు వెళ్తే కాలేజికి లేట్ అయ్యేది…
అలా కష్టం అవుతుంది అని నాన్న ఒక ఆటోని మాట్లాడారు. ఆ ఆటోలోనే వెళ్ళాలి, రావాలి. కొన్నిరోజులు నేను ఒక్కడినే ఆ ఆటోలో వెళ్ళేవాడిని కాని కొన్ని రోజుల తర్వాత ఆ ఆటోలో ఒక అమ్మాయి వచ్చింది. తను ఏ కాలేజిలో చదువుతుందో తెలియదు.
మొదట ఆటో డ్రైవర్ అన్న నన్ను పికప్ చేసుకొని తర్వాత ఆ అమ్మాయిని పికప్ చేసుకునే వాడు. నిజానికి నేను పెద్దగా ఎవ్వరితో కలవను, ఎవ్వరితో మాట్లాడను. అలాగే ఆ అమ్మాయితో కూడా మాట్లాడలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయే నాతో మాట్లాడింది. అలా కొద్దికొద్దిగా మా మధ్య పరిచయం ఏర్పడింది.
ఇక మా నంబర్స్ షేర్ చేసుకొని వాట్సప్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. కొన్ని రోజుల తర్వాత తను నన్ను లవ్ చేసుతున్నట్టుగా ప్రపోజ్ చేసింది. నాకు కూడా తననే ఇష్టమే అందుకే నేను యాక్సప్ట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అక్క పెళ్లి ఉందని తెలిసి మా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేసింది. నేను పెద్దగా ఎలాంటి ఫంక్షన్స్ కి వెళ్ళను కానీ ఆమె పిలిచింది కాబట్టి వెళ్ళాలి అనుకున్నాను.
ఇంతకీ ఆమె పీరు చెప్పలేదు కదా.. తన పేరు అను. ఇదే విషయం అమ్మకి చెప్పాను. అమ్మా నేను కూడా పెళ్ళికి వస్తాను.. అదేంట్రా నువ్వు ఎప్పుడూ రావు కదా.. లేదు అమ్మా చాలా రోజులు అయింది కదా అందుకే… అని అన్నాను సరేలేరా వెళ్దాం అని చెప్పింది అమ్మ. ఇక పెళ్ళిలో అను ని చీరలో చూసాను చాలా అందంగా కనిపించింది. తనతో మాట్లాడాలి అనిపించి తన దగ్గరికి వెళ్లాను…
అను: హే అమ్మ చూస్తుంది కాసేపు ఆగి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ కి రా
అని చెప్పింది… నేను సరే అన్నాను. ఇక ఫంక్షన్ హాల్ వెనకాల కొద్దిసేపు మాట్లాడుకున్నాము. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. కొన్ని రోజులు తను కాలేజ్ కి వెళ్ళే ఆటోలో ఎక్కలేదు.. ఎందుకో అర్ధం కాలేదు.. ఆరోజు రాత్రి వాట్సప్ లో అడిగాను.
అప్పుడు తను మనం ఫంక్షన్ హాల్ లో మాట్లాడుకునేది మా అమ్మ చూసింది. చాలా తిట్టింది ఇక నేను నీతో మాట్లాడలేను నన్ను మర్చిపో అని మెసేజ్ చేసింది… నేను షాక్ అయ్యాను లేదు నేను కావాలంటే మీ పేరెంట్స్ తో మాట్లాడతాను అని చెప్పాను కానీ తను నన్ను బ్లాక్ చేసింది.. అలా మా ప్రేమ కథ ముగిసింది…
– సాయి