చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు

అమ్మ నేను ఆంటీ దగ్గరికి వెళ్తున్నా అంటూ భుజానికి బ్యాగ్ తగిలించుకుని, చెప్పులు వేసుకున్నా… సరే జాగ్రత్త అంది అమ్మా డోర్ వేసుకుంటూ నేను బయలుదేరాను. మా ఇంటి నుండి ఆంటీ వాళ్ళ ఇంటికి చాలా దూరం కానీ ఒకటే బస్ అవడంతో ఇబ్బంది లేదు. కాబట్టి వెళ్ళడానికి ఒప్పుకున్నా….

పది గంటల వరకు అక్కడికి చేరుకున్నా చేరగానే ఆంటీకి గుడ్ మార్నింగ్ చెప్పాను ఆవిడ అప్పుడే బ్రష్ చేస్తున్నారు. నన్ను టిఫిన్ చేయమని అన్నారు ఇంకొక పని పిల్ల నాకు టిఫిన్ పెట్టిచ్చింది నేను టిఫిన్ తిని, టీ తాగాను ఆంటీ కూడా టిఫిన్ తిని కాఫీ తాగిన తర్వాత ఆ అమ్మాయి కూరగాయలు కట్ చేస్తుంటే తనకి ఇంకో పని చెప్పి నన్ను కూరగాయలు కట్ చేయమని అన్నారు ఆంటీ సరే అని కట్ చేశాను.

తర్వాత వంట లో సాయం చేసేసరికి ఆ అమ్మాయి నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది. మిగిలిన పనులు అంటే అంకుల్ కి కాఫీ లు అందించాను. ఆంటీ బట్టలు సర్దేసి నీటుగా పెట్టాను. తర్వాత మంచం మీద ఉన్న బెడ్ షీట్స్ అన్ని తీసి కొత్తవి మార్చాను. ఇలా రోజూ వెళ్ళడం, ఇంట్లో పని చేయడం, వచ్చేటప్పుడు ఆంటీ బస్ చార్జెస్ ఇవ్వడం, మధ్యానం లంచ్ పెట్టడం ఇవ్వన్నీ చేశారు.

బాగానే ఉంది అనుకున్నా, అయితే వాళ్ళింట్లో పని చేసే డ్రైవర్ ముస్లిం. వాళ్ళ అమ్మగారు ఈ మధ్యనే చనిపోయారు అంట అయితే ముస్లిమ్స్ లలో ఒక ఆచారం ఉంది. చనిపోయిన వారి పేరు పై మనం ఎలా వస్త్ర దానం చేస్తామో వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అయితే ఒకరోజు అతను ఒక డ్రెస్ తెచ్చి మీ వదిన ఈ డ్రెస్ నీకు ఇమ్మన్నది అంటూ అంకుల్ ఆంటీ ముందే ఇచ్చాడు.

అబ్బా అవునా చాలా సంతోషం అన్నయ్య… నాకు ఇప్పటివరకు ఇలా ఎవరు ఇవ్వలేదు అని నేను అది తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు అలా దానం చేస్తారని నాకు తెలియదు కాబట్టి నేను ఇస్తున్నప్పుడు తీసుకోవాలి కదా అందువల్ల దాన్ని తీసుకున్నాను. అతను మీ వదిన ఈ డ్రెస్ నీకు ఇమ్మన్నది అని అన్నప్పుడు అతను అన్నా అవుతాడు కదా మరి ఆంటీ గారు ఎలా ఊహించుకున్నారో నాకు తెలియదు.

ఆ మరోసారి రోజు ఏదో చిన్న విషయంలో ఆంటీ నాతో గొడవ పడ్డారు నాకు కాస్త కోపం వచ్చిన మాట నిజమే దాంతో నేను ఇంక ఆ మాటలు పడలేక వెంటనే తిరిగి వెనక్కి వచ్చేసాను. ఆ తర్వాత ఆంటీ అంకుల్ వాళ్ళ ఇద్దరూ నా నెంబర్ ని బ్లాక్ చేశారు.

నాతో మాటలు తగ్గించారు నేను ఊరుకున్నాను ఎందుకంటే నేను అసలు ఏ తప్పు చేయలేదు ఒక చిన్న విషయం ఆ విషయం కూడా ఏంటంటే మిక్సీలో ఎక్కువ సోంపు పెట్టడం వల్ల అది రెడ్ లైట్ వచ్చింది అయితే మామూలుగా కింద దానికి ఒక చిన్న బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కితే మళ్ళీ మామూలుగా అవుతుంది.

కానీ ఆంటీ ఏమో నిన్న నువ్వు మిక్సీ పట్టావు అందువల్ల అది కాలిపోయింది ఇది ఇప్పుడు రిపేర్ చేయించాలంటే మూడు నాలుగు వేలు కావాలి ఇప్పుడు ఇది ఎవరు చేయిస్తారు ఇలా ఎందుకు పాడు చేసావు అంటూ నా పైకి కోపానికి వచ్చారు. ఇంతలో వాళ్ళ డ్రైవర్ వచ్చి ఇది కాలిపోయిందని ఎలా చెప్తున్నారు?

ఇదేం కాలిపోలేదు లోడ్ ఎక్కువ అవడం వల్ల అప్పుడప్పుడు అలా అవుతుంది అని దానికి మళ్ళీ ప్లగ్ పెట్టి కింద ఉన్న బటన్ నొక్కి చూపించారు దాంతో అది మంచిగా పని చేసింది అప్పుడు నేను ఆంటీతో అన్నాను ఇప్పుడు చెప్పండి ఆంటీ అది కాలిపోయిందా ఒకవేళ నిజంగానే కాలిపోయినట్లయితే ఆ అమౌంట్ నేను ఇచ్చే దాన్ని కానీ అది కాలిపోకుండా నేనేమి తప్పు చేయకుండానే మీరు కాలిపోయిందని నామీద నింద వేశారు అలా ఎలా వేస్తారు మీరు?

అసలు ఎలక్ట్రిషన్ ని తీసుకొచ్చి చూపించాల్సింది అతను కాలిపోయిందని చెప్తే అప్పుడు మీరు నన్ను అనాలి అంతే తప్ప మీరు కావాలని నా మీద నింద వేశారు నేను తప్పు చేయనప్పుడు నేను ఒప్పుకోను అని అంటూ అక్కడి నుంచి బయలుదేరాను.

అయితే ఇది జరిగిన రెండు రోజుల తర్వాత నన్ను వారిని కలిపిన ఇద్దరు మిత్రులు నాకు ఫోన్ చేసి ఏదో నీకు పని చూపించాలని మేము అనుకుంటే నువ్వు అక్కడ లేనిపోని మాటలు అన్నీ మాట్లాడవట నువ్వేవో ఆవిడ గురించి వాళ్ళ ఇంట్లో పని మనుషులతో వేరే విధంగా చెప్పావట అంది అంటూ నన్ను తిట్టారు.

అప్పుడు నేను సరే నేను తిట్టాను అంటున్నావు కదా వాళ్ళని అడుగు ఫోన్ చేసి లేదా ఆంటీనే అడగండి ఆవిడ చెప్పింది రికార్డ్ చేయండి నేను నిజంగానే ఆవిడ మీద చెడుగా ఏదైనా చెప్పి ఉంటే అప్పుడు మీరు నన్ను అనండి అని నేను వారికి చెప్పాను.

అప్పుడు అతను సరే నేను మళ్లీ ఆవిడకి ఫోన్ చేసి కనుక్కుంటాను ఒకవేళ అది నిజమైతే నీకు ఫోన్ చేసి నిన్ను తిట్టి ఇకనుంచి నేను నీతో మాట్లాడను అంటూ నాకు వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. ఈ విషయం అంతా మా అమ్మగారు విన్నారు ఏంటి అతను అలా మాట్లాడుతున్నాడు చిన్న విషయానికి గొడవ పెట్టుకుని ఆవిడ పంపించేసింది అంతే తప్ప ఇలా మాట్లాడుతున్నారు అని అన్నారు.

అయితే నిజానికి నేను అలా ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆవిడ నాకు తినడానికి తిండి పెట్టారు అలాగే నాకు డబ్బులు కూడా ఇచ్చారు తన బట్టలు కూడా ఇచ్చారు ఆవిడ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఒక్క కన్న కూతురికన్నా ఎక్కువగా చూసుకున్నారు నాకు మూడో కూతురు అని అంకుల్ ఆంటీ ఇద్దరు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు.

కాబట్టి నేను అలా ఎలా చెప్పగలుగుతాను కానీ చెయ్యని తప్పుకు మాటలంటే మాత్రం నేను భరించలేను నాకు కొంచెం ఆత్మవిశ్వాసం ఎక్కువే ఎవరైనా ఏదైనా అంటే పడలేను అందువల్ల నేను వెనక్కి తిరిగి వచ్చాను ఆ తర్వాత ఆంటీ వాళ్ళకి ఫోన్ చేశాను తిరిగి రావాలని కానీ వాళ్ళు ఫోన్ బ్లాక్ చేసుకోవడం వల్ల మాట్లాడలేకపోయాను.

ఆ తర్వాత అతను మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు అంటే నేను ఏ తప్పు చేయలేదని ఆవిడ లేదా వాళ్ళు గ్రహించారు కావచ్చు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆవిడ వాళ్లకి ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ ఒక సోషల్ మీడియాలో వాళ్ళు నన్ను టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన రాతలు రాయడం మొదలుపెట్టారు.

నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు అయినా నేను తట్టుకొని వాళ్లకి తగిన సమాధానం ఇస్తూ వెళ్లాను. ఆవిడ మీద ఇష్టం ఉంటే లేదా గౌరవం ఉంటే ఆవిడ చెప్పింది వినొచ్చు కానీ అవతలి వారు చెప్పింది కూడా వినాలి కదా కానీ చెప్పుడు మాటలు వల్ల నేను ఒక మంచి మిత్రులను కోల్పోయాను అని అనుకుంటున్నాను.

వాళ్ళు నా గురించి ఏమనుకున్నారో నాకు తెలియదు ఆవిడ ఏం చెప్పుడు మాటలు చెప్పిందో నాకు తెలియదు కానీ నా మిత్రులను నేను కోల్పోయానని ఇప్పటికీ కూడా బాధపడుతున్నాను అయితే వాళ్లు నన్ను టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం వల్ల నేను ఆ సోషల్ మీడియాలో నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

ఇప్పుడు వాళ్ళ కళ్ళు చల్లబడ్డాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు రెండు వైపులా ఉండి రెండు వైపులా వాదన వినాలి. ఎవరిది నిజం ఉంది ఎవరిది అబద్ధం ఉంది అనేది తెలుసుకొని ఇద్దరికీ సందైన కుదరచాలి లేదా ఇద్దరినీ విడిపోమన్నా చెప్పాలి.

అంతే తప్ప చెప్పుడు మాటలు విని ఒకరిని టార్గెట్ చేసి మరొకరు పై జాలి చూపించడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను.

ఇది నిజంగా జరిగిన కథ ఇప్పటికీ కూడా వాళ్లకి తెలియకపోతే వారి అజ్ఞానం వారి మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకుంటున్నాను వాళ్ళు వెళ్లి సైకియార్టిస్ట్ సైకియాట్రిషన్ కలవడం మంచిది. ఇక్కడ వాళ్ల పేర్లు ఇవి నేను మెన్షన్ చేయడం లేదు ఎందుకంటే ఇది చదవడం వల్ల వాళ్లకి అర్థం అయిపోతుంది అప్పుడైనా కనీసం నిజానికి గుర్తిస్తారని ఆశతో ఇది రాస్తున్నాను.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *