చీకటి

” చీకటి “

 

రోహిత్ చదువు పూర్తిచేసి తన ఫ్రెండ్ తో కలిసి ఒక రూమ్ తీసుకుని చక్కగా జాబ్ చేస్తున్నాడు.

రోహిత్ ఆఫీస్ నుండి వచ్చి ఇంటికి వచ్చి వంట కూడా పూర్తి చేసాడు, టైం 10 అయ్యింది కానీ తన రుంమేట్ శివ ఇంకా రూమ్ కి రాకపోవడం తో కంగరు పడి శివకి కాల్ చేసాడు.

రోహిత్: అరే శివా, ఎక్కడ ఉన్నావ్ రా?
శివ: బైక్ పైన ఉన్నాను రా.
రోహిత్: ఇంత లేట్ ఏంటి రా ఈ రోజు?
శివ: ఆఫీస్ లో పార్టీ ఉంది రా, ఫుల్ ఎంజాయ్ చేసామ్ 🍻🍾 రూంకి వచ్చి మొత్తం చెప్ప….
మాట ఇంకా పుర్తి కాలేదు అచానకంగా ఒక పెద్ద అరుపు కాల్ కట్ అయ్యింది 😨ఆ… అరుపు విన్న రోహిత్ గుండె ఆగినంత పని అయ్యింది ఏమి అయిందో తెలియదు, కాల్ చేస్తే కనెక్ట్ అవ్వటం లేదు, ఆలోచిస్తుండగానే టైం 11:30 అయింది కానీ రోహిత్ కి నిద్ర కూడా పట్టలేదు, ఈ లోపే ఎవరు తలుపు తట్టిన శబ్దం…చేమట్లు పట్టిన చేతో తలుపు తీసాడు రోహిత్, ఎదురుగా శివ ఉన్నాడు ఏమింది రా అని అడిగేలోపే శివ పక్కన ఎవరో అమ్మాయి, చూడడానికి రెండు కళ్లు సరిపోనంత అందం కళ్ళు తిప్పుకోలేకపోయాడు.
రోహిత్: శివ ఎవరు ఈ అమ్మాయి?
శివ: తను సీత ధరిలో చిన్న అక్సిడెంట్ అయ్యింది, నేను డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల తనని నేను బైక్ తో గుద్దేసా 😞 first aid చేస్తా అని నేనె తీసుకువచ్చా
రోహిత్: వాట్? 😲 సీతాగారు ఏమైనా దెబ్బలు తగిలాయా?
సీత: నా చేతి పై తగిలింది అని తన చెయ్ చూపించింది
చేయ్య అంత రక్తం 🩸
అది చూసిన రోహిత్ తనని లోపలికి తీసుకువెళ్ళి గాయానికి మందు రాసాడు , కానీ సీత మాత్రం కళ్లు ఆర్పకుండ రోహిత్ ను చూస్తుంది , అది గమనించిన రోహిత్ కొంచెం తల తిప్పి అదం వైపు చుస్తూ, నా అందనికి సీత మయమరచిపోవడంలో తప్పు లేదు అని లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.

శివ:- క్షమించండి సీతా గారు, నా వల్ల ఇలా జరిగింది మీకు.
సీత:- అయ్యో, బాధ పడకండి మీరు నన్ను గుది ఉండకపోతే మనం కలిసే వాళ్ళమే కాదు.
(నవ్వుతూ ఉండి) అది చూసిన రోహిత్ కి మబ్బులో స్నానం చేసినంత హాయిగా ఉంది.

అతి తక్కువ సమయంలో రోహిత్ సీత చాలా దగ్గరయ్యరు, ఇద్దరు ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు, టైమ్ 12 అయ్యింది అయినా ఇంకా ముగ్గురు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు బయట జోరున వర్షం.ఈ లోగా సీతకు దాహంవేసి ఫ్రిజ్ దగ్గరకి వెళ్లి మంచినీళ్లు తాగుతున్నాది. సీతను వెనుక నుండి చూసి రోహిత్ ఒక్కసారిగా మూగబోయాడు. సీత తలకి ఒక పెద్ద గాయం విపరీతమైన రక్తస్రావం తన వైట్ డ్రస్ అంత ఎర్రటి రక్తం కానీ సీతకు చీమ కుట్టినటు కూడా లేదు . రోహిత్ వనుకూతున గొంతు తో బట్టలు మార్చుకున్నా శివా ని పిలిచాడు. సగం షర్ట్ విప్పిన శివ మిగతా సగం విప్పుతు ఏమి అయింది రా అన్నాడు.

సీతాని చూసి ఎంత ఆశ్చర్యపొయాడొ అంతకు వంద రెట్లు ఎక్కువ ఆశ్చర్యపొయాడు . శివ కడుపులో ఒక ఇనుపు రాడు చొచ్చుకుపోయింది. ఇద్దరిని అలా చూసి ఏమీ అర్ధం అవ్వక కంగారుగా లేచి నీలబడ్డాడు.

ఈ సమయంలో రోహిత్ కి ఒక కాల్ వచ్చింది. తనకు కాల్ లిఫ్ట్ చేసి “హలో” అన్నడు.
రోహిత్ ఫ్రెండ్: “హలో రోహిత్ (ఏడుస్తున గొంతు )
శివ ఇక్కడ ఒక అమ్మాయిని accident చేసాడు ఇద్దరు spot dead. నీకు పంపిన location కీ త్వరగా రారా.”

చేమట్లు పట్టిన దేహం తో ఇద్దరిని చూసాడు కాని ఇద్దరు రోహిత్ ని మామూలుగా చూస్తున్నారు.
రోహిత్ ఇంకొక రెండు అడుగులు వెనక్కి వేసి ఫోన్ కింద పడేసి గోడకి అతుకుపోయాడు , రోహిత్ విను switchboard కి తగిలి లైట్స్ ఆఫ్ అయిపోయాయి.
ఆ చీకట్లో ఇద్దరు వికృతమైన రూపాలతో రోహిత్ వైపు బయంకరంగా చూస్తు మెల్లగా వస్తున్నారు, వెంటనె రోహిత్ లైట్ ఆన్ చేసిన తరువాత శివ మరియు సీతా మామూలు అయ్యారు . రోహిత్ మళ్లీ లైట్ ఆఫ్ చేసాడు, మళ్లీ వాళ్ళ రూపం వికృతం మారి రోహిత్ వైపు కోపంగా వస్తున్నాడు. తర్వాత మళ్లీ లైట్ ఆన్ చేసాడు, ఇద్దరు మామూలుగా ఉన్నారు.
రోహిత్ కి అర్థం అయ్యింది, ఇద్దరు ఆత్మలు లైట్ ఆన్ చేస్తే నన్ను చంపెస్తారు, ఏది ఏమి అయిన తెల్లరె వరకూ లైట్ ఆఫ్ చేయకూడదు అని అనుకున్నాడు.
ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి కానీ రోహిత్ ఆపలేదు, బయటకి వర్షం వల్ల కరెంట్ పోయింది 🤯
రోహిత్ “చా అయ్యోయ్యో అహ్హా” అని గట్టిగా అరుస్తూ ఇప్పుడే కరెంట్ పోవాలా అని తల కట్టుకుంటు ఇద్దరి వైపు చేసాడు
ఇద్దరు రోహిత్ వైపు చూస్తూ వెన్నులొ వనుకు పుట్టించెలా
వికృతంగా బయంకరమైన నవ్వుతొ ఇలా అన్నారు
°°°°°° THE END °°°°°°

~ భవాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *