చిధ్రమైన బతుకులు
అమీర్ పేట లో రోడ్డు పక్కన బట్టలు, చెప్పులు, బ్యాగులు అమ్ముకుంటూ ఉంటారు చాలా మంది చిరు వ్యాపారులు. పొద్దంతా అలాగే నిలబడుతూ, గిరాకీ అయితే చాలని, ఆ డబ్బుతో కుటుంబాల్ని పోషించాలి అనుకుంటూ వ్యాపారం చేసేవారు చాలామంది. అయితే ఇందులో కొందరు అలా వ్యాపారం చేస్తూ వడ్డీలకు కూడా ఇస్తే మరి కొందరు మాత్రం వచ్చిన డబ్బు తో రాత్రిళ్ళు ఆ మెట్రో కింద ఉన్న స్థలంలో చిన్నచిన్న ఇటుకరాలను పేర్చి వండుకొని తిని అక్కడే నిద్రపోతారు.
వాళ్లు ఎక్కడి నుంచో బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు కాబట్టి ఇల్లు లేని వారు చాలామంది ఉంటారు అలాంటి వారే ఎక్కడ వండుకొని అక్కడే పడుకో అక్కడే పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆరోజు కూడా అలాగే వ్యాపారాన్ని ముగించుకున్న ఆ జనాలు చివరికి తమ గుళ్ళ కిందికి చేరి ఉన్నదేదో వండుకొని తిని పొద్దటి నుంచి నిలబడి నిలబడి అరచి అరిచి అలసిపోయి ఉన్నారు కాబోలు అందరూ నిద్ర పోయారు.
అసలే చలికాలం కాబట్టి అందరూ ఉన్న వాటిల్లోనే సర్దుకుని దగ్గర దగ్గరగా పడుకున్నారు. వారిలో రాజు కుటుంబం ఒకటి. రాజు అమీర్పేట్ దగ్గర ఉడికించిన మొక్కజొన్నలు అమ్ముతూ ఉంటాడు ఆ పక్కనే అతని భార్య కూడా అదే పని చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఒక పాప ఒక బాబు ఇద్దరినీ దగ్గర్లో ఉన్న చిన్న బడిలో చదివిస్తూ ఏదో జీవితం నెట్టుకొస్తున్నారు కానీ ఇంతవరకు ఇల్లు అనేది వారికి లేదు.
వాళ్లు కూడా బాగా అలసిపోవడంతో రాజు భార్య అన్నం పచ్చడి మెతుకులు ఏదో చేసి పిల్లలకు పెట్టి వాళ్ళిద్దరూ తిని ఒక చిరుగురా బొంత వేసుకొని దానిపై పడుకొని ఇంకొక బొంత కప్పుకొని పిల్లల్ని చలికి కాపాడుకుంటూ అటోకరు ఇటోకరు పడుకొని మధ్యలో పిల్లల్ని పడుకోబెట్టుకున్నారు వాళ్ళకి వేచ్చగా ఉండడం కోసం.
దాదాపు రాత్రి 11:30 గంటలు అవుతూ ఉండొచ్చు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. గచ్చిబౌలిలోని ఒక పబ్బులో పార్టీ చేసుకున్న కొందరు మిత్రులు బాగా తాగి కారులో హుషారుగా పాటలు పెట్టుకుని పాడుకుంటూ హడావిడిగా వస్తున్నారు అందులో రవి, కారు నడుపుతున్నాడు అతను బాగా తాగి ఉన్నాడు.
అయినా తాగిన మత్తులో డ్రైవ్ చేయకూడదు అనే విషయాన్ని మర్చిపోయి చాలా స్పీడ్ గా కారును నడుపుతూ సరిగ్గా అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉన్న స్థలంలో రాజు పడుకున్నా వారిపై ఎక్కించాడు. పెద్ద శబ్దం వినిపించడంతో అందరూ గబగబా లేచి ఏమైంది అనుకుంటూ ఒక్క దగ్గర గుమ్మిగూడారు కారులో ఉన్నవారు మాత్రం దిగకుండా మళ్ళీ కారుని వెనక్కి తిప్పుకొని చాలా ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరూ కూడా ఆ కార్ నెంబర్ చూడలేదు.
ఎవరికి ఏమైందో అన్న ఆత్రుతలో ఆ కారుని ఎవరూ పట్టించుకోలేదు కానీ ఒక అతను మాత్రం తన ఫోన్ తీసుకొని గబగబా ఆ కారుని ఫోటో తీశాడు. ఇంతలో గుమ్మిగూడిన జనాలు వచ్చి చూసేసరికి అక్కడ కారు ముందు టైర్లు రాజు కాళ్ళపై ఎక్కడంతో నుజ్జునుజ్జుగా అయ్యి రక్తం చిందింది అది చూసిన జనాలందరూ కలిసి రాజును దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు.
కానీ ఆసుపత్రి మూసి ఉండడంతో ఏం చేయాలో తెలియలేదు వాళ్ళకి తెలిసింది రక్తం ఆపాలని మాత్రమే కాబట్టి గబగబా వాళ్ల దగ్గర ఉన్న వస్త్రాలతో గుడ్డను కట్టారు కాళ్ళకి. ఈ హడావిడికి లేచిన పిల్లలు, రాజు భార్య ఏడుస్తూ ఉన్నారు రాజు విపరీతమైన బాధతో ఓర్చుకోలేక తన కలలోంచి కూడా నీళ్లు వస్తున్నాయి.
ఎవరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు ఆసుపత్రికి తీసుకెళ్దాం అన్న ఎవరి దగ్గర పెద్దగా డబ్బులు లేవు కాబట్టి తెల్లారి ప్రొద్దున వరకు అందరూ అలా మేలుకోతోనే రాజు కుటుంబంతో ఉంటూ వాళ్ళని ఓదారుస్తూ ఏమీ కాదని ధైర్యం చెబుతున్నారు.
ఎప్పటిలాగే తెల్లారింది గబగబా గవర్నమెంట్ ఆసుపత్రికి రాజుని తీసుకుని వెళ్లారు అందరూ కలిసి. డాక్టర్ ఇంకా రాలేదంటూ అక్కడి కాంపౌండర్ చెప్పేసరికి అయ్యా ఇది రాత్రి జరిగింది ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం కావచ్చయ్య కాస్త చూడండి అంటూ రాజు భార్య అక్కడి వాళ్లను కాలవేలపడిన డ్యూటీ డాక్టర్ రాకముందు మేము ఏమి చేయలేం అంటూ ఆ గుడ్డలు అయితే మాత్రం విప్పేసి పై పైన కట్టు కట్టారు.
11 గంటల వరకు డాక్టర్ రాకపోవడంతో వాళ్ళు ఏం చేయలేక అక్కడే ఉన్నారు మిగిలిన వాళ్ళు మాత్రం రాజు పిల్లలను తీసుకొని వెళ్లి వాళ్లకి టీ బన్ను ఇప్పించారు రాజు భార్యను కూడా ఏదో ఒకటి తినమని అంటే లేదు నేను తినను అని ఆమె ఏడుస్తూనే ఉంది. 11:30 కి మెల్లిగా వచ్చిన డాక్టర్ వీళ్ళని చూసి ఏంటి ఈ గుంపు అంతా అడిగేసరికి కాంపౌండర్ జరిగిన విషయం అంతా చెప్పాడు.
అవునా అయితే ఇది పోలీస్ కేసు అవుతుంది ముందు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు ఈలోపు ఏదైనా జరగొచ్చు ముందు చూడండి అని రాజు భార్య కాలవేలపడడంతో డాక్టర్ ఆ కట్లను ను విప్పి చూసి ఎక్స రే చేయమని చెప్పారు. డాక్టర్ చెప్పినప్పుడు రాజు భార్య దగ్గర డబ్బులు లేకపోవడంతో మిగిలిన వాళ్ళు తలా కొన్ని డబ్బులు వేసుకొని ఎక్స్రే తీయించారు.
ఆ ఎక్స్రే చూసిన డాక్టర్ పాదాలకు బాగా దెబ్బ తగిలింది. ఆ పాదాలను తీసేయక తప్పదు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ మాట విన్న రాజు భార్య గోరుమంటూ ఏడ్చింది. ఒక్క సంఘటన వారి బ్రతుకులను చిధ్రం చేసింది. ఇప్పుడు రాజు అవిటి వాడిగా మిగిలాడు. తాగి బండి నడిపిన వాళ్ళు మాత్రం ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.
వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టినా కూడా పెద్దవారి కొడుకులనే కారణంతో పోలీసులు వాళ్ళని నోరు మెదపకుండా గట్టి వార్నింగ్ ఇవ్వడంతో కూలి పని చేసుకునే వాళ్ళం మనకెందుకు పెద్దవారితో గొడవలు అనుకుంటూ అందరూ రాజుకి రాజు కుటుంబానికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్లారు ఇల్లు అంటే అదే మెట్రో కింద.
ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించే రాజు కుటుంబం ఒక్కరాత్రిలో వాళ్ళ బతుకు చిత్రమైపోయింది ఇప్పుడు ఆ పిల్లలు చదువు మానేసి అక్కడే దేవుని పటాలు అమ్ముకుంటూ రాజు భార్య అదే మొక్కజొన్న అమ్ముతూ భర్తని పిల్లలని పోషిస్తుంది. మన చుట్టూ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనకెందుకులే అని అనుకుంటూ మనం పక్కకు వెళ్ళిపోతాం కానీ దగ్గరగా చూస్తే ప్రతి ఒక్కరి జీవితం ఒక పెద్ద వ్యధ అని తెలిసిపోతుంది.
ఇల్లు లేకపోయినా కష్టపడి పనిచేసే బ్రతుకుకుంటూ పిల్లలని పోషించే రాజు ఇప్పుడు కాళ్లు పోయిన దుఃఖంలో అడుక్కునే వాడిలా మిగిలిపోయాడు. మీ సంతోషం కోసం పక్కవాడి జీవితాన్ని నాశనం చేయకండి. సాటి మనుషులను గౌరవించడం నేర్చుకోండి కనీసం మీరు చేసిన తప్పు తెలుసుకుని వారికి ఎంతో కొంత సహాయం చేసిన మీరు చేసిన తప్పుకు న్యాయం జరుగుతుంది.
ఈ కథ కల్పితమే కావచ్చు కానీ ఇలాంటివి పట్టణాలలో రోజూ జరుగుతున్నాయి కొన్ని రోజుల క్రితం ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్లపైకి ఒక లారీ గుద్దేసి వెళ్లిపోయింది వాళ్ళందరూ అక్కడికక్కడే చనిపోయారు ఆ సంఘటనను ప్రేరణగా తీసుకొని ఇది రాయడం జరిగింది.
– భవ్య చారు