చెవిటి మాలోకం

చెవిటి మాలోకం

నా పేరు అప్పలరాజు…నాకు సుబ్బు అనే స్నేహితుడు ఉన్నాడు….రోజు అమ్మాయిని సెట్ చెయ్ రా అంటే…మళ్ళీ నన్నే తిరిగి … అరేయ్ నీకు ఒక అమ్మాయి కూడా పడట్లేదు ఏంటి రా అని అంటున్నాడు….ఇంకేమైనా గట్టిగా అడిగితే .. రేయ్ మావా నాకు ఒక అమ్మాయిని సెట్ చెయ్ రా .. నేను బాగా చూసుకుంటాను అంటున్నాడు…(మా కోరిక ఏమవుతదో చూద్దాం…)

అలా ఒకరోజున….ఇద్దరికీ ఒక అమ్మాయి కనిపించింది…ఇద్దరికీ అమ్మాయి బాగా నచ్చింది…రేయ్ ఈ అమ్మాయి నాకే పడుతుంది రా..నాకు మాత్రమే సొంతం అని ఇద్దరు కొట్టుకుంటున్నారు…ఇంతలో ఆ అమ్మాయి వచ్చి మీరు కొట్టుకోవాల్సిన పనిలేదు ఇదిగోండి నా పెళ్లి కార్డు అని ఇచ్చి వెళ్లిపోయింది..
ఏదో ఎన్నాళ్ళ నుంచో ప్రేమించిన ప్రేమికుల లాగా అంతా అయిపోయిందన్నట్టు బాధ పడిపోతున్నారు…

|| వారి ఇద్దరి సంభాషణ.. ||

అప్పలరాజు : నీకు అంటే వినపడదు కానీ నాకేం తక్కువ రా… ఫిలిం ఇండస్ట్రీ లోకి వెళ్తే అనుష్క కూడా నాకు సరిపోదు కదరా…
సుబ్బు : రేయ్ నీ చిప్ప మోహము నువ్వు ఏ రోజైనా ముఖం అద్దంలో చూసుకున్నావా… బాహుబలి 1 లో దేవసేన కూడా చూడదు కదా రా నీ మోహము.. చీపురు కట్టలు అమ్ముకునే వాడిలా ఉంటావ్…
ఏ అమ్మాయి అయినా దగ్గరనుంచి చూసిందంటే కచ్చితంగా ఆ రోజు నైటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది కదరా…
అప్పలరాజు : నేను అందంగా ఉన్నానని కుళ్ళు రా నీకు కుళ్ళు…
ఏం రా నీకు సరిగ్గా వినపడదు కదా అమ్మాయిలు అనగానే అన్ని బానే వినిపిస్తున్నట్టున్నాయి నీకు..
సుబ్బు : రేయ్ అమ్మాయిలు అని అనకు రా.. నీకు ఎవరు సెట్ అవ్వరు వదిలేయ్..
అప్పలరాజు : ఇదో పని అయిపోయింది నాకు..
నేనొకటి చెప్పడం…
నువ్వు ఒకటి వినడం… కర్రీ పాయింట్ లో కర్రీ అమ్ముకునే ఫేస్ నీది… చెప్పింది వినడం సరిగ్గా రాదు కానీ పెద్ద నీతి కబుర్లు చెప్తున్నాడు మాకు…. చూడండి మాస్టారు…
సుబ్బు : ఏంటి రోయ్ ఏదో పొగుడుతున్నట్టున్నావ్….
అప్పలరాజు : బజ్జి కొట్టు పెట్టుకో అంటున్న…
పొగడక పొగడక నీ గురించే పొగడాలి లే…
అదే తక్కువైంది మాకు…
సుబ్బు : ఏదో వాగుతున్నావ్ కానీ నాకు ఏం సరిగ్గా వినిపించలేదు…. అయినా అవి బంగారు మాటలు మరి నేను వినడానికి… దేవుడు నాకు చెవుడిచ్చి మంచి పని చేశాడు రా లేకపోతే నువ్వు చెప్పే అడ్డమైన మాటలన్నీ వినాల్సి వచ్చేది…
అప్పలరాజు : ఏడిసావులే…
సుబ్బు : రేయ్.. రేయ్..రేయ్ ..అదిగో అమ్మాయి
నేను చూశాను కాబట్టి నేను ట్రై చేస్తా…
అప్పలరాజు : చేసుకోపోరా నీ కన్నా ఎక్కువ ఏంటి…
సుబ్బు : అమ్మో వీడు అడ్డు చెప్పలేదంటే ఏదో ఉంది…
అప్పలరాజు : ఇంకా ఏంట్రా ఇక్కడే నుంచున్నావు వెళ్ళరా వెళ్ళు…
సుబ్బు: నిజంగా వెళ్లమంటావా…
అప్పలరాజు : నువ్వు ప్రభాస్..
ఆవిడ అనుష్క మరి…
వెళ్ళు వెళ్ళు…
|| సరే కదా అని వెళ్ళాడు మన సుబ్బు ||
సుబ్బు : హాయ్ అండి.. నా పేరు సుబ్బు..మరి మీ పేరు ?
అమ్మాయి: నా పేరు సౌమ్య..
సుబ్బు : ఓకే సేమియా గారు.. మీరేం చేస్తారు..
అమ్మాయి: కోపంగా పేస్ పెట్టి.. ఐ యాం సైట్ మేనేజర్ అని అంటుంది..
సుబ్బు : || అంత పద్ధతిగా పలకరిస్తే కోపంగా పేస్ పెట్టింది ఏంటి దిక్కుమాలిన మొహంది||
ఎంత మందికి సైట్ వేశారు… అదే ఎన్ని సైట్లు అమ్మినారు సేమియా గారు…
అమ్మాయి : వీడో దిక్కుమాలిన వాడిలా ఉన్నాడు..
పొద్దున్నే ఎవరు మొహం చూసానో వీడు తగులుకున్నాడు..  
|| అంతా నా కర్మలే అని అనుకునే లోపు సైలెంట్ గా కూర్చున్నా మన అప్పలరాజుని చూసి తన దగ్గరికి వెళ్లి..నువ్వు బాగా నచ్చావు అని అన్నది.. ఇంతలో సుబ్బు కూడా వచ్చి.. నేను నచ్చితే నాతోనే డైరెక్ట్ గా  కదా మా ఫ్రెండ్ తో ఎందుకు చెప్పడం అని అన్నాడు ||
అమ్మాయి : ఏంటి ఇతను మీ ఫ్రెండా…
ఛి కొట్టి వెళ్ళిపోయింది..
అప్పలరాజు : అప్పడాలు అమ్ముకునే వాడివి నువ్వు..
శాడిస్ట్ గా… చెప్పక చెప్పక ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి నచ్చావ్ అని చెప్పింది రా.. వచ్చి చెడగొట్టేసావు…ఏం బతుకు రా నీది…
సుబ్బు : నువ్వే అన్నావ్ కదరా ఆవిడ అనుష్క మొహం అని అందుకే నాకు సెట్ అవ్వనిది నీకెందుకులే అని …
అలా ఫ్లోలో వచ్చేసింది చెప్పిన అంతే… ఏం పర్లేదులే బాధపడకు
నీకు నేను.. నాకు నువ్వు..
అప్పలరాజు : నీతో ఉంటే ఉన్నది పోతుంది.. రావాల్సింది పోతుంది…
దురదృష్టం ఎప్పుడు నీ రూపంలో నా పక్కనే ఉంటుంది కదరా…
సుబ్బు : అంత కరువులో ఉండకు రా..
అప్పలరాజు : అవును మరి అమ్మాయి అని నేనే పరిగెత్తాను కదా…
సుబ్బు : రేయ్ మళ్లీ అమ్మాయా ఎక్కడ రా..
అప్పలరాజు : అవున్రా మీ అమ్మగారు వచ్చారు.. వెనక్కి తిరిగి వెళ్లి చూడు..
సుబ్బు: అందంగా ఉందారా..‌?
అప్పలరాజు: అమ్మ అంటుంటే అమ్మాయి అంటాడు.. సర్లే వీడు సావు వీడు చస్తాడు గానీ వీడికి ఏదో ఒకటి చెప్పుదాము..
ఇప్పటివరకు అంత అందమైన అమ్మాయిని చూసి ఉండవేమో..
|| వెనకాల వాళ్ళ అమ్మ చేతిలో చీపురు కట్ట పట్టుకుని ఊరంతా తిప్పి కొడుతుంది ||
అప్పలరాజు : వీడి చెవిటితో నేను కూడా పెళ్లికాని ప్రసాదుని అవుతానేమో.. కాదు కాదు.. పెళ్లికాని అప్పలరాజుని అవుతానేమో..
|| తన్నులు తిన్న సుబ్బు వచ్చి రేయ్ ఈ గ్యాప్ లో ఎవరినైనా చూసావా ||
అప్పలరాజు : నీకో దండం రా బాబు నీతో ఉంటే పెళ్లి అవకుండానే పైకి పోతానేమో పెళ్లయ్యాక వచ్చి నీతో మాట్లాడతా అని వెళ్ళిపోయాడు
సుబ్బు: నా పక్కన ఉండడం వల్లే నన్ను ఎవరు చూడలేదు.. హమ్మయ్య ఇప్పటికైనా ఎవరో ఒకరు నాకు పడతారు లే.. ఇప్పుడు చూడు వాడు చెప్పిన అనుష్కనే సెట్ చేసుకుంటా అని కలలు కంటున్నాడు..
|| అప్పలరాజు కి పెళ్లి అయిపోయింది ..సుబ్బు కి చెవుడు పెరిగిపోయింది ||
ఎంతైనా ఎవరికైనా పెళ్లి అవ్వకుండా ఉంటుందా చెప్పండి ..
అలా మన సుబ్బు కి కూడా పెళ్లయిపోయింది..

మన వాడికి చెవుడు LKG లో ఉంటే ఆ అమ్మాయికి 8 వ క్లాస్లో కూర్చొని ఉంది..
ఈ జంట 10 వ క్లాస్ ఎలా పాస్ అవుతుందో చూద్దామని అనుకుంటున్నా అప్పలరాజు..
[ఎలాగైనా ఇద్దరికీ ఇలా అమ్మాయిలు దొరికేశారు ఎదవలే కానీ అమ్మాయిని అమ్మలా చూసుకునే అంత గుణవంతులు..]

 

 

-ప్రేమ అలియాస్ ప్రేణీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *