చెరగని చిరునవ్వు సాక్షిగా
చిద్విలాసపు నిండగా
చిరునవ్వు సాక్షిగా
రోజు గడుచును సాఫీగా
విరుల పరిమళాల నింపగా
నీకు తోడై నిలిచేది నిజంగా
ఎల్లప్పుడూ అదీ వేడుకగా
అందానికే అందమై నిలుపుగా
ముఖారవిందము ఒంపుగా
మధురం చేయును హాయిగా
పలికే పలుకులను ముందుగా
విలువను పెంచును మెండుగా
ఎదుటివారికి కన్నులపండుగగా
అది పని చేయును ఔషదంగా
పని కొచ్చును అపార ధనం గా
అపుడే వుండును ఉల్లాసంగా
నడిపించును సరికొత్త శక్తిగా
నీకు నింపును ఎల్లప్పుడూ శక్తిగా
అందుకోవాలి అందరు
చెరగని చిరునవ్వుతో
దేవుడిచ్చిన వరంగా …….?
– జి జయ