చెలి
విరిసిన సుమాల మాలవో
అరివిరిదిన రంగుల హరవిల్లువో
మణి కాంతులు ఎగజిమ్మే తారవో
వసంతాల మందారమాలవో
పూరి విప్పిన నెమలి పింఛం అంచువో
కల హంసల నడకల వయ్యారి భామవో
కమ్మని కావ్యంపు పాటవో
కదిలే మది ఊహావో
మెరిసే మెరుపుల మురిసే
నవ్వుల అందానివో
నా ఊహల సామ్రాజ్య రాణివో
నా హృదయ నెచ్చెలివో ..
నా బిగి కౌగిలిలో ఒదిగిపోయే
మనసైన నా చెలివో….
– అర్చన