చేదు జ్ఞాపకాలు
కొన్ని జ్ఞాపకాలు చేదు అనుభవాలను మిగిలిస్తుంది..
మరికొన్ని జ్ఞాపకాలు జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది…
ఇంకా కొన్ని జ్ఞాపకాలు జీవితమంతా ఆవేదనని మిగిలిస్తాయి..
జ్ఞాపకం అనేది ఒక అందమైన కలలా ఉండాలని
నేను ఎప్పుడో నుండి అనుకున్న
బాల్యంలో ఉన్నప్పుడు గడిపిన జ్ఞాపకాలు ఎన్నో…
కాలేజ్ రోజుల్లో కొత్త స్నేహాలు పరిచయాల జ్ఞాపకాలు…
నా జీవితంలో ప్రతి ఒక క్షణాన్ని జ్ఞాపకంగా
మార్చుకోవాలని అనుకున్న…
జ్ఞాపకాలు గమ్మత్తుమైనవి కొన్ని సార్లు వద్దన్నా
వదలకుండా ఆనందాన్ని ఇస్తూ
ఇంకొన్ని సార్లు వెంటపడి కన్నీళ్లు పెట్టుకునే చేస్తాయి…
జ్ఞాపకాల సుడిగుండంలో చిక్కుకుపోయిన నేను
నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతూ
నీ అనే జ్ఞాపకాలతో ఉంటూ
నా జీవితంలో ప్రతి క్షణం కోసం ఎదురుచూస్తున్నా
నువ్వు నా జీవితంలో ఒక భాగం మాత్రమే
కానీ నా గమ్యానికి అడ్డ దారులు వెదుకుతూ ,
ప్రతి ఒక్కరికి సరైన పద్ధతిలో బుద్ది చెప్పడానికి ,
సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను…
– మాధవి కాళ్ల