చరణ్ నీవెక్కడ ??

చరణ్ నీవెక్కడ ??

మాది మెదక్ జిల్లా లోని ఒక మండలం అక్కడ మా నాన్నగారు ఇంగ్లీష్ టీచర్ గా పని చేసే వారు నిజానికి మాది కరీంనగర్ జిల్లా కానీ నాన్నగారు టీచర్ గా అపాయింట్ అయ్యింది మొదలు ఆ ఊరే మాకు సొంత ఊరు అయ్యింది.

అక్కడే మేము పుట్టడం వల్ల ఆ ఊరిలో ఉన్న అందరూ మా నాన్నగారు అంటే ఎంతో అభిమానం చూపేవారు అభిమానం చూపడానికి కారణం ఉంది.

ఎందుకంటే మా నాన్న ఆ ఊరికి వచ్చినప్పుడు కరెంటు లేదట, ఇంకా రేడియో కూడా లేదట ఎవరో ఒక ధనవంతుల ఇంట్లో ఉండేది అట, అప్పుడు మా నాన్నగారి దగ్గర చిన్న ట్రాన్స్ సిస్టర్ ఉండేది అంట అందులో సేల్స్ వేసుకుంటే పని చేసేది నల్లగా చిన్నగా వైర్ లెస్ తో ఉండేది అంట అన్ని ఆట లేనా అంటారా మరి మేము వాటిని చూడలేదు గా …. అందుకే అట లు అంటున్నా …

ఇక ఆ ఊర్లో వాళ్లకు క్రికెట్ అంటే కూడా తెలియదు అంట నాన్న గారు వచ్చిన కొత్తలో ఆ రేడియోలో క్రికెట్ వచ్చినప్పుడు కామెంటరీ వింటూ ఉండే వాడు నాన్నగారు అలా వినడం చూసిన అబ్బాయిలు ఏంటి సార్ అది అడిగారు అంట ఇక వాళ్లకు ఆ ఆట గురించి చెప్పి నేర్పించాను అని చెప్పేవారు నాన్నగారు అది మళ్లీ ఇంకొక సారి చెప్తాను కానీ ఇప్పుడు చరణ్ గురించి చెప్పుకుందాం ..

అలా ఆ ఊర్లో నేను పుట్టడం వాళ్ళ కళ్ళ ముందు పెరగడం వల్ల నాకు ఆ ఊర్లో వారు అన్నా అక్కడి మనుషులు ప్రేమ అన్నా చాలా ఇష్టం ఏర్పడింది. నేను అదే ఊర్లో పుట్టాను మా తమ్ముళ్ళ తో కలిసి అక్కడే అడుకున్నం చదువుకున్నాం పెరిగాము .

మా నాన్నగారు చదువు చెప్పే బడిలోనే మమల్ని కూడా చదివించారు అక్కడ పది వరకు ఉంది సెంటర్ కూడా అదే కావడం వల్ల పక్కనున్న ఊర్లోని విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయడానికి అక్కడికి వచ్చేవారు. నేను చిన్నప్పటి నుండి అదే బల్లో చదువుతూ పదో తరగతి కి వచ్చాను .

తొమ్మిదో తరగతి లోనే నేను వయసుకు రావడం వల్ల కాస్త సిగ్గు పడుతు ఉండేదాన్ని అలా పరీక్షల మధ్యలో కావడం వల్ల కొన్ని రోజులు బడికి వెళ్ళ లేదు ఆ తర్వాత వేసవి సెలవులు వచ్చాయి.

దాంతో బడికి వెళ్ళ లేక పోయాను సెలవుల లో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అందరం తిరిగి నాన్నగారు మమల్ని స్కూల్ లు తెరిచక రెండు వారాలకు మళ్లీ ఈ ఊరికి తీసుకుని వచ్చారు అప్పటికే పుస్తకాలు తేవడం తో అమ్మ వాటికి అట్టలు వేసి ఇచ్చింది .

చాలా రోజుల తర్వాత బడి లో అడుగు పెడుతూ ఉంటే చాలా వింతగా కొత్తగా అనిపించింది అప్పుడే యవ్వనం లోకి అడుగు పెట్టిన నేను సిగ్గుగా పుస్తకాలు గుండెల కు ఆడుగా పెట్టుకుని క్లాస్ లోకి అడుగు పెట్టాను.

అరె శాంతి వచ్చిందే రా రా ఎన్ని రోజులకు వచ్చావు ఇన్ని రోజులు ఏమైనావు నువ్వు రాక పోతే మేము వేరే ఎక్కడైనా జాయిన్ అయ్యవేమో సారు నిన్ను హాస్టల్ లో వేశాడు ఏమో అనుకున్నాం ఏంది పెద్దమనిషిని అయ్యవా అంటూ నా స్నేహితురాళ్ళు నన్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు అప్పటికే కొందరు పెద్ద వాళ్ళు అవడం. వల్ల వాళ్ళు కనిపెట్టి అందరికీ విషయం చెప్పారు

అప్పట్లో కానీ వాళ్లను చిన్న పిల్లలు గా అయినా వారిని పెద్ద వాళ్ళుగా ఒక గ్రూప్ గా ఉండేవాళ్ళం అలా ఇన్ని రోజులు చిన్న వారి గ్రూప్ లో ఉన్న నేను పెద్ద వాళ్ళ గ్రూప్ లోకి మారాను అన్న మాట.

ఇంతలో బయట నుండి మగ పిల్లలు ఒక్కసారిగా క్లాస్ లోకి వచ్చారు అందరూ పాత వాళ్ళ మధ్యలో ఒక కొత్త మొహాన్ని గమనించాను నేను అతను కూడా నన్ను గమనించి ఆశ్చర్యంగా చూడడం నా కళ్ళు దాటి పోలేదు.

కళ్ళ తోనే అతన్ని నా ప్రాణ స్నేహితురాలు అయినా ఉష కు చూపించి ఎవరు అని అడి గాను. తను ముందుకు వంగి చేవి లో చరణ్ అని కొత్తగా వచ్చాడు పక్కనున్న తండా నుండి అని అనగానే నాకు అర్దం అయ్యింది ఇంతలో బెల్ కొట్టారు దాంతో మేము ముచ్చట్లు అపేసీ ప్రార్థన చేయడానికి చేయించడానికి వెళ్ళాం .

నాదే పెద్ద క్లాస్ కాబట్టి అమ్మాయిల్లో నేను మాస్టారి కూతుర్ని కాబట్టి అంతవరకు నేనే ప్రార్థన చెప్పి, ప్రతిజ్ఞ చేయించే దాన్ని అలాగే చేయిద్దాం అని వెళ్తుండగా ఇంకొక మాస్టారు నన్ను అపెసీ చరణ్ అంటూ పిలిచాడు నాకు చాలా అవమానంగా అనిపించింది.

ఇన్నేళ్ల నుండి వారసత్వంగా వచ్చిన నా హోదా నీ ఎవరో ముక్కూ మొహం తెలియని వాడు వచ్చి లాక్కునే సరికి నాకు అతని పైన కోపం పగ ఆక్రోశం అన్ని పెరిగి పోయాయి.

నేను వెళ్లి లైన్ లో నిలబడి నా ప్లేస్ లో అతన్ని చూస్తూ లోపల పల్లు కొరుకుతూ ఉంటే ఉష నా చెవిలో నువ్వు వెళ్లగానే ప్రత్యేక తరగతులకు వచ్చి హెడ్మాస్టర్ మెప్పు పొందారు అందుకే అంత టెక్కు అన్నది.

దాంతో నా మనసులో అతన్ని ఎలాగైనా అక్కడి నుండి తప్పించాలని మళ్లీ నేనే ఆ స్థానం లోకి వెళ్లాలి అని మంగమ్మ శపథం లాంటిది మనసులోనే చేసుకున్నా..

ఇక అప్పటి నుండి నా దృష్టిలో చరణ్ శత్రువు లాగా మారేడు స్కూల్ లో జాయిన్ అయ్యింది మొదలు ప్రార్థన, ప్రతిజ్ఞ నావే ఇప్పుడు నా స్థానాన్ని నా నుండి లాక్కున్న చరణ్ నకున్న్ ఎకైంక శత్రువు కావడం వల్ల నేను పగ తో రగిలిపోయాను.

ఆ తర్వాత క్లాస్ లో కూడా నా పుస్తకం తీసుకునే మాస్టారు అతన్ని అడగడం అతను నవ్వుతూ ఇవ్వడం, ప్రశ్నలు అడిగితే అతను సమాధానం చెప్పడం మాస్టారు అతన్ని మెచ్చుకోవడం తో నా మనసు మండి పోయింది.

అతన్ని అందరూ పొగుడుతూ ఉంటే నాకు అతని పై పగ లావాలా వెల్లువెత్తింది మన స్థానాన్ని ఎవరైనా తీసుకుంటే ఇలాగే ఉంటుందేమో కదా అందుకే నాకు కడుపు మండిపోయింది.

అతన్ని మనసులో మనసారా తిట్టుకున్నా ఈ మాస్టారు లకుబుద్ది లేదని అందర్నీ తిట్టుకున్నా కొన్ని రోజులు రాక పోతే నా స్థానం మర్చేస్తారా అంటూ ఏడ్చాను ఇంటికి వెళ్ళి …

పాపం నాన్న నా ఏడుపు చూసి ఏమనుకున్నాడో కానీ బడికి వెళ్ళాక హెడ్మాస్టర్ గారికి ఏం చెప్పారో తెలియదు కానీ దాని ఫలితం తెల్లారి నాకు కనిపించింది.

ప్రార్ధన చెప్పడానికి వస్తున్న చరణ్ ని ఆపేసీ హెడ్ మాస్టారు గారు నన్ను చెప్పమని పిలవడం తో నా సంతోషం రెట్టింపు అయ్యి అతని మీద సాధించిన మొదటి విజయం గా అనుకున్నా అదే ఆనందం లో వెళ్లి ప్రార్థన చేయించి ప్రతిజ్ఞ చెప్తుంటే తప్పుగా చెప్పాను అది చూసి చరణ్ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ ఉండడం చూసి ఉడికి పోయాను.

హెడ్మాస్టర్ గారు సరి చేయడం తో తిరిగి చెప్పాను నాకు హిందీ సరిగ్గా రాకపోవడం వల్ల అలా జరిగింది దాంతో పట్టు బట్టి హిందీ ప్రతిజ్ఞ నేర్చుకున్నా నేను తెల్లారి మళ్లీ సరిగ్గా ఏ తప్పులు లేకుండా చెప్పాను .

ఇక అప్పటి నుండి నేను అతన్ని సాధించాలని బాగా చదువుతూ మాస్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉండేదాన్ని అయితే ఒక రోజు పి,యి , టీ పీరియడ్ అవడం తో అందరూ ఆడుకోవడానికి వెళ్లారు మేము ఆడుకుంటూ ఉన్నాము .

మేము ఖో ఖో అడుతు ఉంటే వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు కబడ్డీ లో అతను షర్ట్ విప్పి అడడం చూసి అచ్చేరు పొందాను చాలా అందంగా ఉన్నాడు కాయ కష్టం చేసే శరీరం కాబట్టి అలా కండలు తీరి కనిపించాడు నా కళ్ళకు ..

అతన్ని నేను చూడడం వల్ల పక్కనుండి వస్తున్న ముప్పును ఊహించ లేదు . ఖో ఖో ఆడుతున్న నా స్నేహితురాలు నన్ను అవుట్ చెయ్యాలని నేను వేసుకున్న డ్రెస్ స్కర్ట్ ను లాగింది దాంతో ఒక్కసారిగా పిన్ ఊడిపోయి స్కర్ట్ కిందకు జారిపోతూ ఉంటే నేను గట్టిగా పట్టుకుని క్లాస్ లోకి పరుగులు పెట్టాను.

అది చూసి మిగిలిన వాళ్ళు నవ్వితే నా స్నేహితురాలు నా వెనకే వచ్చింది మగ వాళ్లు ఇదేమి గమనించకుండా వారి ఆట లో వాళ్ళు ఉన్నారు. నేను లోపలికి వచ్చి నా స్కర్ట్ కు ఉన్న స్టీల్ పిన్ చూస్తే అది విరిగి పోయి కనిపించింది అది చూసి నా మిత్రురాలు ఎవరి దగ్గర అయినా కంట ఉందేమో అడిగి వస్తాను అని వెళ్ళింది.

తను వెళ్ళిన కాసేపటికి చరణ్ లోపలికి వచ్చాడు అతను వస్తాడు అని ఊహించని నేను గబుక్కున బెంచిల వెనక దకున్నా అది చూసి ఏమైంది అలా ఉన్నావు అంటూ దగ్గరగా రాబోయాడు నేను పో పో బయటకు వెళ్ళు అంటూ అరిచాను దాంతో అతను బిత్తర పోయి వెనక్కి తిరిగాడు ఇంతలో వెళ్ళిన ఉష వచ్చి నీకేం పని ఇక్కడ వెళ్ళిపో అన్నది చరణ్ తో అతను తల దించుకుని వెళ్ళిపోయాడు గబగబా

ఉష కంట తెచ్చి ఇచ్చింది దాన్ని స్కర్ట్ కి పెట్టుకుని ఎలాగో గడిపాను పీ,యి,టి అయిపోగానే లంచ్ టైమ్ అవ్వడం తో ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాను నేను..

ఇక అప్పటి నుండి చరణ్ మౌనంగా అయ్యాడు నాకు అతన్ని చూసినప్పుడల్లా సిగ్గుగా ఉండేది కానీ ఇష్టం పెరిగింది అతని మీద క్లాస్ లో ఉన్నంత సేపు ఇద్దరం దొంగ చూపులు చూసుకుంటూ ఉండేవాళ్ళం అతన్ని చూడాలి అంటే చాలా సిగ్గు వేసేది. వెనక నుండి అతన్ని చూస్తూ ఉండేదాన్ని నేను చరణ్ కి కూడా ఏమని పించిందో కానీ ఇక ఏ విషయం లోనూ నాకు ఎదురు రాలేదు.

అదే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఇంతలా పగ ద్వేషం పెంచుకున్న నేను ఒక్కసారిగా ఇలా మారిపోవడం ఏమిటో నాకు అర్దం కాలేదు అతను ఎదురు వచ్చిన ప్రతిసారీ న నా బుగ్గ ల్లో సిగ్గులు పుచేవి ,అతన్ని చూడగానే నాకు అదోలా గా ఉండేది కళ్ళు బరువుగా కిందకు వాలేవి హృదయం బరువు ఎక్కేది

గుండెల్లో గుబులు గా ఉండేది ఇంటికి వచ్చాక అతను నన్ను చూసిన చూపులను గుర్తుకు తెచ్చుకుంటూ ఒక్కదాన్నే నవ్వుకుంటూ ఉండేదాన్ని ప్రవాహం లా ఉండే నేను నిశబ్దం గా మారాను ఏదో పెద్దరికం వచ్చినట్టు హుందాగా ఉన్నాను .

ఇలా చూపులతో మూగ మనసులు మాటలతో కాలం గడిచింది పరీక్షలు దగ్గరకు వచ్చాయి అందరం అందర్నీ వదిలే వెళ్లాలి అనే బాధ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఫేర్ వెల్ పార్టీ లో పాటలు, డాన్స్ లు చేసాము అందరి అడ్రస్ లు తీసుకున్నాం గుండెలు బరువెక్కి కొందరం ఎడ్చేసాము.

కానీ చరణ్ దగ్గరికి వెళ్ళి నేను ఏమీ అడగలేక పోయాను ఎందుకో నాకు అర్దం కాలేదు అతను కూడా నాకు ఏమి ఇవ్వలేదు అడ్రస్ కానీ ఏదో ఒక సందేశం కానీ ఇవ్వకుండానే పరీక్షలు రాసిన అన్ని రోజులు అవే చూపులతో మనస్సు లో చెప్పలేని బాధ ఉన్నా బయట పడలేదు ఎవరం..

పరీక్షల చివరి రోజులు అతను పరీక్ష లు రాసి రోడ్ పైకి వెళ్తుంటే నేను అందర్నీ వదిలేసి మరి వెనకే వెళ్ళాను కానీ అతను ఒక్కసారి కూడా వెనుదిరిగి చూడలేదు బస్ రాగానే ఎక్కి కూర్చున్నాడు ఆ బస్ దుమ్ము రేపుతు నా ముందే దూరం అయ్యాడు. ఇప్పుడు ఇన్నేళ్ళు గడిచినా అతని జాడ లేదు .

మా తర్వాతి వారు అంటే జూనియర్స్ అందరూ కలిశారు కానీ అందరికీ పెళ్ళిళ్ళు అవడం ఎవరూ సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల ఎవరు ఎక్కడున్నారో తెలియదు ఇప్పటికీ మా ఇల్లు అదే ఊర్లో ఉంది నాన్నగారు పోయాక దాన్ని మేము పట్టించుకోవడం లేదు.

కనీసం ఇది చదివాక అయినా చరణ్ ఒక ఫోన్ అయినా చేస్తాడా లేదా అసలు ఉన్నాడా ఉంటే ఎక్కడ నేను తనకు గుర్తున్నననా లేదో అన్ని సమాధానం తెలియని ప్రశ్నలు ……

చరణ్ నీవెక్కడ ?????

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *