భిన్నత్వంలో ఏకత్వం
చూపిన బొటన వేలితో తరం
మారుతుందని కాదు…మనస్సుల
తత్త్వాలు మారాలని చేయికి చేయి
పిడికిలిగా కలిపిన బంధం భుజానికి
భుజం కలుపుతు ఐదు వేళ్ళను కలిపిన
శక్తిగా మనిషివై ఆస్వాదిస్తు…ప్రపంచానికి
వెలుగువై నడవాలని…
మనస్సున ఆప్యాయతను…
అరచేయి చలువగా పైకెత్తి చూపుతు
భాయి భాయిలంటు అందరు బాగుండాలని
అందులో నేనుండాలని ఐక్యతా భావంలోని
పరమార్థం… అన్నిమతాల సారాంశం
ఒక్కటే నని సస్యశ్యామలతతో ఒడిగట్టిన
దేశ సౌభాగ్యాన్ని పండిస్తు శాంతి సందేశమై
కనబడాలని….
గంభీర సాధనలతో గళం విప్పిన
నినాదమై… భిన్నత్వంలో ఏకత్వమనే
ఏకాంత ధోరణిని అనుసరిస్తు…ఈ దేశం
నాజన్మ హక్కని ప్రతి మనస్సున పూచిన
శోభితమై వర్ధిల్లాలని… అల్లాహ్ అక్బర్
ముజేమాఫ్ కరో కాలంతో నడిచిన
పాపాలను దయతో కడిగేయాలని…
పంచభుతాత్మకమైన సృష్టి ఆవరణలో…
తారతమ్యం లేని బతుకులతో
సమూహంగా అభివృద్ధి చెందాలని
ఐదు పూటలా శ్రద్ధా భక్తులతో
ఇంద్రయా సక్తులను జయిస్తు…జీవితం
ఒక కలగా ఊహాత్మకం కారాదని…
మానవత్వంచే కడగబడిన మణిపూసలుగా
నిత్య నూతనాలను పరిమళింప చేసే
పవిత్ర మాసం రంజాన్….
–దేరంగుల భైరవ