భంగపడని దేహపు చైతన్యం
ఓం బ్రహ్మస్త కుండి హస్తాం…
శుద్దజ్యోతీ స్వరూపిణీం…
సర్వతత్వమయీం…
వందే గాయిత్రీ వేదమాతరం…
ఓం గాయిత్రీ దేవతాయే నమః…
మధుకైటభులను గెలుచుటకు
అవతారునికే శక్తి ప్రధానం చేసిన
శక్తి స్వరూపిణి స్త్రీ శక్తియే…అనంతము
అందులోని సందేశానికి నిదర్శణం…
అందుకే ఆరాధించు అభిమానించు
నిరంతరాలతో ఘణీభవించిన
మూర్తీభవానికి వందనాలు…
మగవాడి వెనకన రహస్యమై
నిలబడుతు…దారి తప్పిన బంధాలను
ప్రతి బంధకాలతో నిలుపుకొంటు…
మధిలోని భావాలకు ప్రాణంపోస్తూ కదిలే
ప్రాణాంతకాలను గుడ్డన కట్టి నవయుగపు
వారసత్వాన్ని నిలపాలని నడిచే శక్తి
సమయం స్త్రీ శక్తియే…
నిరంతర విషతుల్యాలు తనువును
పొడుస్తున్నా తన గమ్యాన్ని మార్చుకోని
నిగర్వితనంతో సందేశాలకు పిడికిలౌతు…
స్వభావాన్ని ఉద్యమింప జేసే సంఘమ శక్తికి
రూపం స్త్రీ శక్తియే…
తెలిసిన సంగతులు పొంచినవై…
నేనని నా గమనంగా తెలవారక ముందే
ఉద్దరింపులు లేని సహనాలు నా ఊపిరిని
ఆపుతున్నాయి…ఆతల్లి గర్భమున
లింగ నిర్ధారణతో మా ప్రపంచాన్ని కాల్చేస్తు
అంకురాన్ని ఆదిలోనే తుంచేస్తున్నారు…
విశ్వంలో తను కాదు…
విశ్వమే తనలోనిది…చరాచర సృష్టి
నియమాలకు స్థన్యమిచ్చిన ఆ తల్లి ఆనందం
నిరంతరాయమానం…భంగపడని దేహపు
చైతన్యం ఆ అమృత మూర్తికి అడుగడుగున
పూలప్రభల హారతులతో స్వాగతం పలుకు…
-దేరంగుల భైరవ