భగవంతుని ప్రతిరూపాలు
ఈ ప్రకృతిని సృష్టించినవాడు
ఈశ్వరుడైతే, ఈ సృష్టికి
ప్రతిసృష్టి చేసేది స్త్రీ మాత్రమే.
స్త్రీ బిడ్డకు జన్మనిస్తుంది. ప్రతి
కాన్పు ఆమెకు మరోజన్మతో సమానం.
ఎంతో నొప్పిని, బాధను భరించి
బిడ్డకు జన్మనిచ్చే స్త్రీకి ఎంత ఓర్పు,
ఎంత శక్తి ఉండాలో కదా.
పూర్వం చదువుల తల్లి
సరస్వతీ మాతను స్త్రీ శక్తిగా
కొలిచారు.సంపదలను
ఇచ్చే లక్ష్మీ మాతను కూడా స్త్రీ శక్తిగా
కొలిచారు.అందరికీ అన్నం పెట్టే
అన్నపూర్ణాదేవి ఆ పార్వతీ
మాతను కూడా స్త్రీ శక్తిగా
కొలిచారు. ప్రాచీన కాలం
నుండి స్త్రీని దేవతగా కొలిచే
సంప్రదాయం మన భారతీయ
సమాజంలో ఉంది.
త్రిమూర్తులకు కూడా రక్షించిన
ఘనత ఆ జగన్మాతకే ఉంది సుమా.
అంత శక్తి ప్రతి స్త్రీ మూర్తిలో ఉందని
చాలా సార్లు ఋజువైంది.
ఏ మహిళా కూడా అబల కాదు.
ప్రతి స్త్రీ కూడా సబల అనేది అక్షర సత్యం.
అంత మహోత్కృష్టమైనది
స్త్రీ శక్తి. ఆ విషయం ప్రతి
మహిళకు తెలియజేయాలి.
అందుకు సాటి మహిళలే
పూనుకోవాలి.
-వెంకట భాను ప్రసాద్ చలసాని