భారతావనికి మొదటి బిడ్డ పుడమి తల్లి రైతు బిడ్డ
చెమట చుక్కల్లో స్నానం చేసేవాడే రైతు..
బురద సుగుంధంలో పరిమళించే వాడే రైతు..
నింగికి నేలకి ఆత్మ బంధువు రైతు..
తొలకరి జల్లులు నేలను ముద్దాడిన వేళ..
పుడమి తల్లికి పచ్చని పట్టుచీర కట్టి..
పసుపు కుంకుమల పూల వర్ణాల గుబాళింపు ఫలాల కమ్మదనాల పంటలతో
భూమాతకి సింగారించి సీమంతం చేసి నేలమ్మకి పురుడు పోసి..
దేశమనే కుటుంబాన్నీ కాపాడుకుంటూ భారతావనికి కడుపు నింపి..
అప్పుల ఆర్తానాధాల్లో పక్కడొక్కలు విరిగిన కన్నీరు అనే కష్టాన్ని మోస్తూ తాను ఉరి కొయ్యల ఉయ్యాలలో ఊరిగే వాడే రైతు..
తాను దేశ బరువును మోసే బలిపశువు..
గింజ గింజగా మారి పక్షులకు ప్రాణం పోసేవు
మెతుకు మెతుకు గా మారి ఆకలి ఆర్తానాదాలు తీర్చేవు..
సమస్త మానవాళికి రక్షకుడా.
జీవకోటికి ప్రాణం దేవుడా
వ్యవసాయం అనే సాయం నీది
సాయం అనే వ్యసనం నీదే
ఓ రైతన్న దేశానికి రాజువే ఎల్లప్పుడూ..
– సీత