బడిపాఠం
ఒక బడి పాఠం జీవితాన్ని నడిపే ఎన్నో అనుభవాల సమాహారం. మనం ఎదురుకున్న ఇబ్బందులనించి, విషదాలనించి, గెలుపోటములనించి నేర్చుకుని తప్పులను సరిదిద్దుకునే మార్గం గుణపాఠం.
గుణపాఠం అతి కఠినమైన పాఠం. కష్ట నష్టాలను ఎదురుకున్నాక తెలుస్తుంది, తెలిసాక ఎమీ పీకలేని పరిస్థితి ఎదురవుతుంది. బడిపాఠం ఎందరో మహానుభావుల గుణపాఠాల కలయిక. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన తల్లిదండ్రులు, శిక్షకులు, బడిపంతులు, అందరూ మనజీవితమును రూపుదిద్దే బ్రహ్మ సమానులు.
జంతువులకి సైతం వాళ్ల జాతీ రిత్యా నేర్చుకునే ఒక బడిపాఠం కావాలి. సింహాన్ని వేటాడమని చెప్పేది, తన జాతి నించి చూసి నేర్చుకునే బతుకుతెరువు బడిపాఠం. పక్షులని ఎగిరే టట్టు తన బలాన్ని కనువిప్పు చేసే సాధనం బడిపాఠం. ఇలా ఎన్నో ఎన్నెన్నో. కలల్ని నిజం చేసే ఒక జీవన ఇంధనం బడిపాఠం.
– హరీశ్వర