బడి పాఠాలు
మంచి చదువుల మార్గమే బడి పాఠాలు కదా
గురువులు నేర్పిన గురుతర బాధ్యతలు
బ్రతకడానికి
బడి పాఠాలు నేర్పితే
సమాజాన్ని చదివితేనే అసలైన అర్థం
విలువల విచిత్రాలు
సంస్కారాల సంగతులు
జీవితపు హద్దులు
ఆదర్శాల పద్దులు
అవకాశాల పొత్తులు
అవసరాల మిత్రులు
లక్ష్యాల సాక్షులు
జ్ఞానాల మూలం
విలువైన నైపుణ్యాలు
అక్షరాల ప్రాముఖ్యం
భవితకు పునాదులు చిగురాశల విన్యాసాలు
చింతలేని చిన్నప్పటి బడి పాఠాలుజీవన పయనానికి నిలువుటద్దాలు
నేర్పిన పాఠాలు నేర్చుకున్న విద్యలు జీవితంలో ప్రతిరోజు పాఠాలను నేర్పిస్తూ
ముందుకు నడిపేదే
బడి పాఠాల భాష్యం……
– జి జయ