బాల్యం మాయంః
బాలుడు నేను,
భీముడు కాను..
మీ జేబున లెక్కలు,
మా స్వేదపు చుక్కలు..
నువు చేసిన నేరం
నే చదువుకు దూరం,
చెదరెను బాల్యం,
నరకరు తుల్యం…
మాసిన బట్టలు,
మోసిన బుట్టలు,
చూసెనట్టులే
పనిచేయని చట్టాలు..
మారాము చేసేమా??
మార్పును కోరేము..
కావాలిక విడుదల,
ఎన్నాళ్లీ బెడదల,
దడ దడ లాడు భయజ్వాల?
నా కలమే కాగడగా,
భయమను నిశికే,
గుండెను చీల్చి,
నా కవనమే,
నరసింగపు గోళ్ళై,
అజ్ఞానపు
హిరణ్యకశపులనంతరించగా!
ఓ చైతన్య దీప్తి అవతరించదా?
పై కవితతో పాటు ఆటవెలది పద్యం:
బాల్య మెవరికైన బాగుండవలెగాని
పనుల చేత మాకు పైసలేల
గురుల విద్య లేక గురితప్పె భవితలు
విడుదలంటు లేదు వినరె జనులు
– సత్యసాయి బృందావనం