మేడే
కదలాడే ప్రపంచంలో
అందరికన్నా ముందుగా
వేచి వెలుగును చూసేది
శ్రామికుడే .
శ్రమ జీవన గమనంలో
శక్తినే పెట్టుబడిగా
సాగుతున్న సైనికుడు
దారిద్ర్యరేఖ ని దాటలేని
సంఘజీవి శ్రామికుడు
పగలు రాత్రి కి తేడా లేకుండా పనిచేసినా
ఫలితం లేని కూలి
హక్కులరోజులు వచ్చినా
తిప్పలు తప్పని మనిషి
యంత్రంలా పనిచేసినా
పురోగతిని చూడని జీవనం
కట్టడాల పునాది రాళ్ళు
ఎత్తినా కునుకు తీసే
చోటులేని వింత జీవి
అభివృద్ధికి సమిధ లైనా
సంపద లేని శ్రమజీవి
శ్రమతో స్వేదం చిందించినా
ప్రయోజనం లేని
ప్రతిభావంతుడు
పనిభారం తో పోరాటం
ప్రమాదాల తో పయనం
ప్రగతిశీల చక్రాలతో
ఊహల ఊపిరితో
నిరంతర సేవలో
బరువైన బాటసారి
శ్రామిక వెతల సహనజీవి
చైతన్యపు శక్తులు
శ్రామిక జనజీవులు
వలస వచ్చిన కార్మికులు
బతుకు భారాన్ని మోస్తూ
భద్రత లేని జీవితం గడుపుతూ కష్ట నష్టాల
ఖాతా లేని రోజులు
చాకిరీ చేసే సమిధలు
కష్టజీవుల కదనంతో
మనందరి సుఖం కోసం
నిరంతర సైనికుడు
అందరికీఅన్ని పనులు చేసి
ఒడిడుకుల ప్రతినిధి
పరిణామాల ప్రపంచంలో
మారిపోయే కాలంలో
మారని అగ్ని కణం
కడలి తీరంలో
కూడలి లేని కష్టాల
కార్మికుడు వారు లేని
సమాజం వెలుగు లేని
ఉదయం
శ్రమ జీవన కార్మికుల
చరణాలకు మన అందరి
వందనం మరి….
– జి జయ