అవే కళ్లు
చిరునవ్వుతో నీ స్నిగ్దమనోహర రూపం..
నీ చూపుల్లోని కారుణ్యం
నీ చూపుల్లోని లావణ్యం
అవే కళ్లు నా హృదయాన్ని సృశించాయి..
అవే కళ్లు నాలో నిద్రాణమైన
మనసు పొరలను చీల్చి
నాలో ప్రేమతత్వాన్ని వెలికి తీసింది..
అవే కళ్లు అవే చూపులు
నా జీవితానికి నాంది పలికాయి
నా ఉహల పల్లకిలో ఊరేగించే నా మనసు చిత్రించిన
ఉహా చిత్రం నీ సౌందర్య రూపం
నా అంతరంగంలో నిక్షిప్తం చేసుకోనా..
భావి జీవితానికి ఆలంబనగా..
– అంకుష్