అసమానత
ఏది నిజం..!
ఏది నిజం..!
74 ఏళ్ళ గణతంత్రమా..?
ఆనాదిగా ఉన్న మగతంత్రమా..?
ఈనాటికీ ఆడవాళ్ళ ఆత్మాభిమానాన్ని
వంటగదిలో బంధించడమేనా..?
స్వతంత్ర, గణతంత్ర భారతం సాధించిన ఘనత..!
ఆడ వాళ్ళకి చదువెందుకూ..!
ఎదురు మాట్లాడే తెగువెందుకూ..!
అనడం మానుకోని నీచపు సమాజమా..?
అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించిన భవిత..!
అమరవీరుల త్యాగం..!
చిత్రపటాలకే పరిమితం..!
అంబేద్కర్ కలలు కన్న దేశం..!
శిశువు దశలోనే కోల్పోయింది ప్రాణం..!
లేదు నిజం..!
లేనే లేదు నిజం..!
సమానత్వం ఒక బూటకం..!
కేవలం సమాజం ఆడుతున్న నాటకం..!
నిజంగా నిజం..!
ఇదే నిజం..! ఇదే నిజం..!
– రమ్య