అర్చన
రెక్కలు తెగిన ఆశ
కూలిపోతుంటే
మనసు చేష్టలుడిగి
కూలబడింది
వర్తమానం వేగుచుక్కని వేలమేసింది నిరాశ
కలలన్నీ నిస్సహాయంగా
చూసే కథలయ్యాయి
కల్పతరువనుకున్న కాలం
కాలు దువ్వుతోంది
కాలు కదలదు..నోరు మెదపదు
జీవితం మదుపులో ఉన్నట్టుంది
రిక్త హస్తంలా మస్తిష్కం
శూన్య దేవతగ మారింది
చుట్టూ బంధనాల్లాంటి కందకాలు
విరిసే బాట విధ్వంసమయింది
వీరుల ప్రమాణాలన్నీ వీథిన పడ్డాయి
వెడలిపోయిన వసంతంలా
వడలిపోయిన ఆలోచనలు
కల్లోల్లాన్ని కానుక చేస్తుంటే
మనసు కుదుర్లను బిగించి
శూన్యాన్ని ఆత్మవిశ్వాసంతో
అర్చిస్తేకానీ
అస్థిరతల పొగమంచును దాటేలాలేను
– సి. యస్. రాంబాబు