ప్రేయసీ కో లేక
నా అందమైన ప్రియా
అందుకో నా ఈ లేఖ
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎందుకో నాకే తెలియదు
నీ ఎత్తు పళ్లను చూసా
నీ దొడ్డు ముక్కును చూసా
నీ లావైన పెదాలని చూసా
నీ గుమ్మడి కాయ లాంటి
మొఖాన్ని చూసా,
నీ పిలక జుట్టును చూసా
ఎటూ చూస్తున్నావా తెలియని
నీ కళ్ళను చూసా
పిప్పళ్ళ బస్తాలా ఉన్న నీ
అందమైన నడుమును చూసా
అరటి చెట్టులా ఉన్న నీ కాళ్ళను చూసా
రాయిలా ఉన్న నీ పాదాలను చూసా
స్తంభం లా ఉన్న నీ చేతులను చూసా
ఏమీ చూసానో కానీ, నిన్ను చూసిన
క్షణం నుండి నువ్వే నా కలలోకి
వస్తున్నావు, అందుకే రాస్తున్నా నా
ఈ ప్రేమ లేక ,ప్రేమతో నిన్ను నన్ను
ప్రేమించమని బతిలాడుకుంటూ
కాళ్ళు పట్టుకుని వేడుకుంటూ
ఈ లేక పంపుతున్న నా ప్రేమ ను
అంగీకరిస్తూ మల్లోక లేఖ రాయి
ప్రియా… ఇట్లు నీ పై ప్రేమ లేక
నీ ప్రేమలేక పరితపిస్తున్న నీ
ప్రేమలేని ప్రియుడు ..
ఆ ప్రేయసి కూడా అంతంత మాత్రమే వచ్చిన చదువు తో తిరిగి సమాధానం ఇస్తుంది.
పియుడు కి నా లేక
నీ లేక అందింది
నాకు నిన్ను చూడగానే పెమ
పుట్టినది. ఆ పెమా ఎందుకు
పట్టిందో తెల్వదు గాని
నీ నున్నటి గుండును సిసో
నీ మీసం లేని మొకం సూసొ
నీ ఉబ్బిన బొఱ్ఱను సుసొ
బీడీలు తాగి నల్లగా మారిన
పెదాలని సుసి,
సారాయి తాగి తాగి
ఊగుతూ వెళ్ళే నిన్ను సుషో
మూటలు మోసే ని సేతులని సూసో
తడబడుతూ నడిచే నీ కల్లని సుసో
నష్యం పిల్షే నీ ముక్కును శుసో
కండ ల్లేనీ నీ కాలి పిక్కలు సుషొ
ఎత్తిన సీసా దించకుండా తాగే నీ
మగటణం సుసా
కానీ నిన్న పెమించా, నాకు నువ్వంట ఇట్టమే
నువ్వొక పాలి మా అయ్యతో మతాడు
నాకు నిను సుసినప్పటి నుంచి నిద్ర అస్థలేదు
గుండెల్లో బాధ , మనసు నీ కాడ ఉందని
నిదర రాక ఎర్ర గా మారిన నా కల్లే దానికి సచ్చం
నాకు నువ్వంటే పెమ లేక పెమతో ఈ లేక రతున్నా
అచ్చి నన్ను మానువాడి పో
ఇటు
నీ పెమలేక పేయసి
గమనిక: ప్రేమ ఎవరికైనా పుట్టొచ్చు, ప్రేమ అజరామరం, దానికి ఆకారం తోనూ, అందం తొనూ పని లేదు. ప్రేమించే మనసు ఉంటే చాలు.
– భవ్య చారు