అంతర్లీనం
ఆకలికి అలమటిస్తున్న దీనులను ఆదుకునే అమ్మతనంలో
అపహాస్యం పాలవుతున్న ఆదర్శాలకు వ్యతిరేకంగా వెలిబుచ్చుతున్న అసహనంలో
అండదండలు కోల్పోయి అల్లాడుతున్న అభాగ్యులకు ఆపన్న హస్తం అందిస్తున్న చేతులలో..
కన్నబిడ్డలే కర్కోటకులై
కన్నవారిని వీధులపాలు చేస్తే కలతపడ్డ ప్రతి హృదిలో
అడుగడుగునా అంగృష్టమాలులు వీరవిహారం చేస్తుంటే
విరుచుకుపడ్డ గుండె ధైర్యంలో
అంతర్లీనంగా ఒదిగి ఉండేదే అసలైన సౌందర్యం..!
అంగృష్టమాలులు = పూర్వం ఒక కిరాతకుడు మనుషులను చంపి వాళ్ళ అంగుష్ఠాలను అంటే బొటన వేళ్లను మాలగా ధరించేవాడు. అందుకే అలాంటి వాళ్లను అంగృష్టమాలులు అంటారు.
-మామిడాల శైలజ