సౌందర్యం
బాహ్య సౌందర్యం చూసి
మోసపోయే జనులారా.
అంతః సౌందర్యమే ముఖ్యం
అని తెలుసుకోండి మీరు.
చూపులకు సుదరాంగులైనా
చేసేవి రాక్షస క్రీడలే సుమా.
మొహాల్ని బట్టీ మనుషులను
అంచనా వెయ్యలేము కదా.
ఆకారాన్ని చూసి మోసపోకండి.
అందమైన దేహంలో రాక్షసుడు ఉండొచ్చు.
కురూపి మనసులో దేవుడు కొలువై ఉండొచ్చు.
బాహ్య సౌందర్యం చూసి
మోసపోయే జనులారా.
అంతః సౌందర్యమే ముఖ్యం
అని తెలుసుకోండి మీరు.
-వెంకట భానుప్రసాదు చలసాని