అంతర్జాల విజ్ఞానం

అంతర్జాల విజ్ఞానం

కంప్యూటర్ ఇంజనీర్ లోకేష్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇంటి నుండే ఆఫీసు పనులు పూర్తి చేసుకునే విధానాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అని అందరికీ తెలిసిన విషయమే. అలా పని చేస్తున్న లోకేష్ దగ్గరకు అతని భార్య సలోని కాఫీ తీసుకుని వచ్చింది. “అసలు అంతర్జాలం అంటే ఏమిటండీ? నిన్న మన బాబు మణి అడుగుతున్నాడు” అని తన భర్తను అడిగింది.

అప్పుడు లోకేష్ “అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అనే విషయం నీకు తెలిసే ఉంటుంది. ఆధునిక కాలంలో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. నెట్‌వర్క్ అనేది డేటా మార్పిడి మరియు వనరులను పంచుకోవడం కోసం ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన రెండు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల సమూహం” అని తన భార్యకు చెప్పాడు కాఫీ తాగుతూ.

“అది సరేనండీ, ఈ ఇంటర్నెట్ వల్ల లాభాలు ఏమిటి” అని సలోనీ తన భర్తను అడిగింది. అప్పుడు లోకేష్ కాఫీ సిప్  చేస్తూ “ఇంటర్నెట్ ఉండటం వల్ల మనకి అనేకమైన సేవలు లభిస్తున్నాయి. అంతర్జాలం సహాయంతో మనం ఇంట్లో కూర్చుని మనకు కావలసిన వారికి మెయిల్ పంపించవచ్చు. దీన్ని ఈ-మెయిలు అంటారు. నెట్వర్క్ సౌకర్యాన్ని ఉపయోగించి ఇల్లు వదలి బయటకి వెళ్ళకుండా చాటింగ్ చెయ్యవచ్చు.

నెట్వర్క్ సౌకర్యం వల్ల విషయ సేకరణ చెయ్యవచ్చు. నెట్వర్క్ ద్వారా వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని మనం వాడుకునేందుకు వాడే సాఫ్టువేర్ అప్లికేషన్ ను బ్రౌజర్  అంటారు” అన్నాడు లోకేష్ అప్పుడు సలోనీ తన భర్త లోకేష్ తో “మరి నెట్వర్క్ ఉపయోగించి సినిమాల గురించి తెలుసుకోవచ్చా” అని అడిగింది.

అప్పుడు లోకేష్ “సినిమాలంటే ఇష్టం ఉన్న వారు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ కి వెళ్లి సినిమాల గురించి వారికి కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు” అన్నాడు. అప్పుడు సలోనీ “ఇంటర్నెట్ వల్ల నష్టాల గురించి చెప్పండి” అని భర్తని అడిగింది. దానికి లోకేష్ “చూడు సలోనీ, ప్రమాదకరమైన సైట్లకు వెళ్ళినట్లయితే మన కంప్యూటరుకు వైరస్ సోకి చెడిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాలంలో అనవసర విషయాల వల్ల మన అముల్యమైన సమయం వృధా అవుతుంది” అని అన్నాడు.

“చాలా మంచి సమాచారం నాకు తెలియజేసారు. చాలా ధాంక్స్. మీకు ఇష్టమైన గుమ్మడి కాయ కూర రెడీ చేస్తున్నాను. త్వరగా పని ముగించుకుని డైనింగ్ టేబుల్ వద్దకు రండి” అని సలోనీ భర్తతో చెప్పి వంట గదిలోకి వెళ్ళింది. మళ్ళీ కంప్యూటరుతో కుస్తీ మొదలుపెట్టాడు లోకేష్.

– వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *