అందరూ ఉన్న అనాధ
నిత్యం అత్తింటి బాధలు భరిస్తూ…
భర్త ప్రేమిస్తూనే వేధిస్తుంటే..
సంతోషపడాలో బాధపడాలో తెలియక మతమవుతూ..
శక్తికి మించిన కష్టం చేస్తుంటే..
ఓర్వలేక తిరగబడుతుంటే..
గుండెను బండ చేసుకొని ఆ భారాన్ని మోస్తూ గమ్యం కోసం
వెతుక్కుంటూ ప్రయాణిస్తుంటే
గిట్టని వారు అడ్డుగోడలు కడుతూ నా వారినే నా పైకి ఉసిగొల్పుతుంటే…
ఎవరితో చెప్పుకోవాలో తెలియక అందరూ ఉన్న అనాధనై..!!
ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో వారి మాటలు బాణాలయి గుండెకు గుచ్చుకుంటుంటే గాయాల నొప్పులతో పచ్చి పుండ్లలా సలుపుతుంటే…
జీవితం మీద విరక్తి పుడుతుంటే..
కన్న గర్భాలు కళ్ళ ముందు కదలాడుతుంటే ..!!
వారి కోసమైనా భరించక తప్పక..
“బరువైన గుండె గాయాల”తో జీవితం నెట్టుక రాక తప్పలేదు.
-బేతి మాధవి లత