అందమేఆనందమే
అందమైన అందం..
దేంట్లో ఉంది?
రామ చిలకది ఆకర్షించే..
అందం…
కోకిల అందం ఆకర్షించదు..
కానీ…
దాని గానం..
అందమైన ఆకర్షణ..
అందమైన మనుషుల్లో..
అందమైన మనసు..
ఉండక పోవచ్చు..
అంద వికారమైన..
మనుషుల్లో అందమైన..
మనసు ఉండచ్చు..
దేవుడి సృష్టిలోని..
ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో..
ఏదో ఒక అందం దాగే ఉంటుంది..
అది మనం తెలుసుకునే..
మసలుకుంటే అంతా అందమే!!
ఆనందమే!!
-ఉమాదేవి ఎర్రం