అందమైన శత్రువు
మనసును మాయ చేసి
తోడై యుద్ధం చేస్తుంది
అందమైన శత్రువు నీలో
దాగిన అహంకార భూతం
అహంకారం మనిషికి ఆభరణంగా వుండాలి
కాని
ఎదమాటున వదలక
శత్రువుగా నిరంతరం
వేటు వేస్తుంది
మారని మనుషులకు
స్వార్థమై వెంటాడుతుంది
అహంకారంచెరలోబందీలై
చెంతచేరి శత్రుత్వాన్ని
పెంచుతుంది
పైచేయిలా గెలవాలని
పరితపిస్తుంది
ఆశపడుతూ ఆశపెడుతూ
అంతర్గతంగా ఆదేశిస్తుంది
అహాన్ని వంచి తుంచితే
బంగారు తీగై మెరుస్తుంది
లేనిచో ఇనుప తుప్పుగా
మారుతోంది సుమా…..?
– జి జయ