అమ్మోఇల్లు

 అమ్మోఇల్లు

 

ఎంటి కవిత ఎక్కడికి వెళ్తున్నావు, ఆఫీస్ లో పనేం లేదా వెళ్లిపోతున్నావు?? ఇంతకీ ఇల్లు నచ్చిందా, ఎలవుంది?? నేను చూపించిన ఇల్లు అని రాధ అడిగింది..
రావే నీ గురించే చూస్తున్న వొచ్చావా.. ఏమే నీకు ఇంత పెద్ద వూరిలో ఇదొక్కటే ఇల్లు అద్దెకు దొరికిందా!! అని తిట్టాను రాధను..

ఎందుకే ఏమయింది బానే ఉంది కదా ఇల్లు, నేను చ్చుసాక నీకు నచ్చుతుందని తెలిసి అడ్వాన్స్ ఇచ్చాను.. ఇపుడు ఎందుకు తిడుతున్నావు?? పైగా రెంట్ కూడా చాలా తక్కువ కదా.. మరి ఏమయింది అని అడుగుతోంది అమాయకురాలిలాగ…

నీ మొహం., అమ్మో అదేమి ఇల్లు తల్లి నికో దన్నం నేను వెంటనే ఇంకో ఇల్లు చూసుకొని మారిపోతాను అంటూ దాన్ని తిడుతున్నాను…
అదేంటి నిన్న ఒకరోజుకే అంత భైపడే విషయం ఏమిజరిగింది అని అడిగింది..

రాత్రంతా ఇనప బీరువా నాప రాయ్ మీద లాగిన గోల.. అస్సలు నిద్రపట్టలేదు.. ఇలాయితే నేను ఆఫీస్ లోనే నిద్రపోవాలి రోజు అన్నాను..
ఓ అదా మీ ఇంటి ఓనర్ గారు ఫ్లూట్ విద్ధ్వంసుడు ఆయన ఫ్లూట్ వాయించివుంట్టారు అంది..

ఆయన విద్వాంసుడా!! కాదే విధ్వంసుడు..
అదేం వాయిప్పుడే నా తల్ల పగిలిపోయింది నేను వెళ్ళను ఆ ఇంటికి అమ్మో…!!ముందు ఇల్లు మారాలి అని చెప్పి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాను…

ఎంత తిరిగినా ఇల్లు దొరకలేదు తప్పక ఆ ఇంటికే వెళ్ళాను ఇవాళ రాత్రి మాత్రం ఎలాంటి సౌండ్స్ రాలేదు హాయిగా పడుకున్నాను..
పొద్దున ఆఫీస్ కి వెళ్తూ ఓనర్ ఇంటిలోకి చూసాను ఎవరూ కనపడలేదు ఇంతలో ఓనర్ గారి భార్య., ఎంటమ్మ ఎంకావాలి అంటూ నాదగ్గరికి వొచ్చింది..

ఎంలేదండి సార్ లేరా అని అడిగాను.. అవునమ్మ ఆయన ఇక్కడ వుండరు ఎప్పుడయినా వొస్తూవుంటారు ఆయన విద్వాంసులు కదా చాలా బిజీ గా వుంటారు కాళీ ఉంటేనే నేను గుర్తొస్తాను ఆయనకి అని సిగ్గుతో చెప్తున్నారు… నేను ఒక్కత్తినే ఉంటాను అని ఇంతలో భాదా..

ఆవిడ అమాయకత్వం చూడలేకఓ అవునా సరే నేను ఆఫీస్ కి వెళ్తానని చెప్పి వెళ్ళాను..ఏమే కవిత దొరికిందా ఇల్లు?? అని అడిగింది..ఏమి దొరకలేదు కానీ ఆ ఇంట్లోనే ఉంటాను ఆయన ఎపుడైనా వస్తారట రోజు వుండరట అందుకు నేను అదే ఇంట్లో వుంట అన్నాను..కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం అమ్మో ఇల్లు!!

 

-శ్రీ కిరణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *