అమ్మా-నాన్నలు
ఏమయ్యోవ్..
బారెడు పొద్దెక్కే దాకా లేవకపోతే పనికొప్పుడు పోయేదీ?
ఏమయ్యా..
పొద్దు పోయేదాకా పనిచేస్తూ ఉంటే ఆరోగ్యం పాడైపోదా?
కష్టపడే వారి జీవితాలు ఇలాగే ఉంటాయి కదా!
ఐతే పై రెండు సందర్భాల్లో మనం పనిని గమనించాం..
మనం గమనించాల్సింది ఇంకొకటి లేకపోలేదు సుమా!
బారెడు పొద్దెక్కింది, పొద్దు పోయింది..
ఇవి నిత్యమూ జరిగేవే కదా….!
ఆ… కదా!
అంచేత, ప్రతిరోజు అలసిపోకుండా,
ఇన్నాళ్ళూ మనకోసం, ఈ భూమికోసం
ఓ ఇద్దరు అమ్మానాన్నల్లా మనకోసం
ప్రతిరోజూ పనిచేస్తున్నారు కదా!!
సూర్యుడేమో అమ్మంటః
ఎందుకంటే పొద్దంతా మనతోనే ఉంటూ ఇంట్లో పనులు చూస్కుంటూ,
రాత్రి నాన్నకి వెలుగునివ్వడానికి తను మాయమౌతుందంట..
చంద్రుడేమో నాన్నంటః
పగలంతా ఎక్కడ పనిచేసి వచ్చారో ఏమో,
రాతిరి చల్లగా నిదర పుచ్చడానికి వచ్చేస్తారుగా!
ఈ ప్రయాణంలో వారిరువురికీ గ్రహణాలు, అమావాస్యలూ ఉన్నా కొంత కాలానికి చక్కగా సర్దుకుపోతుంటారు….
కనిపించే ప్రత్యక్షదైవాలు
అమ్మానాన్నలు, వారే సూర్యచంద్రులు..
వారే కార్మికులు, శ్రామికులు..
పై వ్యాఖ్యానానికి ఆటవెలది పద్యముః
సూర్యదేవు కన్న శుభకరుడు యెవరు?
నిత్య కార్మికులకు నితను ప్రియుడు
చందమామ కన్న చల్లని వారెవరు?
శ్రామికులను తాను శయన పరుచు
– సత్యసాయి బృందావనం