అమ్మ నవ్వింది

అమ్మ నవ్వింది

అమ్మ అనే కమ్మనైన పిలుపు కన్నా తియ్యని పిలుపు ఏది లేదీ లోకం లో, అమ్మ అనే పదానికి ఎంతో శక్తి ఉంది. అమ్మ అనే పదానికి ఎంతో ప్రేమ, మమకారం, ఆప్యాయత అనురాగం కలగలిపిన ప్రతి రూపం అమ్మ.

కన్న తల్లిని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక వేళ మర్చిపోయారు అంటే వాళ్ళ కంటే నికృష్టులు ఎవరూ ఉండరు. అమ్మను కష్టపెట్టే వాడు అసలు మనిషే కాదు. కొందరు తల్లిని అనాధ శరణాలయం లో వదిలేస్తారు. నవమాసాలు మోసి, కని, మల ముత్రాలు తీసేసిన తల్లిని కాదనుకుంటారు.

కానీ ఆ తల్లి మాత్రం తన పిల్లలు బాగుండాలి అని కోరుకుంటుంది. అలాంటి వాళ్ళు నా దృష్టిలో నికృష్ట హీనులు. కుక్క కంటే కూడా హీనమైన వారు.

అంత నికృష్టులు అయినా ఆ తల్లి మాత్రం నా పిల్లలు బంగారం అనే అంటుంది తప్ప వాళ్ళు వెధవలు అని ఏ తల్లి అనదు.

తన పిల్లల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిని చీల్చి చేండడే శక్తిలా మారుతుంది. నా తల్లి కూడా అంతే అలాగే నా పిల్లలు బంగారం అంటుంది.

*********

వైష్ణవి, వినోద్ లకు పెళ్లి అయ్యింది. భర్త గా వచ్చిన వాడు బాగా చూసుకోవాలి అని అనుకుంటారు ఏ ఆడపిల్ల అయినా, వైష్ణవి కూడా అలాగే అనుకుంది. సినిమాలో చూపినట్లుగా అత్త, మామలు ఉంటారేమో అనుకుంది. ఆడపడుచులు స్నేహంగా, మరుదులు తల్లులగ తనను చూస్తారేమో అనుకుంది.

కానీ ఆమె ఆశలు, కోరికలు అన్ని తలకిందులు అయ్యేసరికి మొదట బిత్తర పోయినా, తర్వాత తనను తాను సంభాలించుకుని బాధ్యతలో తన వంతు కృషి చేయసాగింది.

ఎన్నో కొట్లు, తిట్ల మధ్యలో ముగ్గురు పిల్లలు కలిగారు. అయినా ఆమె కష్టాలు తీరలేదు. భర్త, అత్తా మామలు బాగా తాగేసి తిట్టడం, కొట్టడం, ఆమెని ఎన్ని రకాలుగా కష్ట పెట్టాలో అన్ని రకాల కష్టాలు పెట్టారు.

అయినా ఆమె సహనంతో, ఓర్పుతో ఉంటూ, తన పిల్లల కోసం బతుకుతూ, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేది. కానీ ప్రమాదం ఇంకో రూపం నుండి వచ్చింది.

అదేంటంటే వైష్ణవి కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పేరు నవీన. వైష్ణవి అత్తగారు ఒకలాంటి పల్లె పట్టణం కానీ ఊర్లో ఉండేవాళ్ళు. అయితే నవీన అదే ఊర్లో ఉన్న ఒక ప్రైవేటు బడిలో అయిదో తరగతి చదువుతోంది.

ఆ పాపను రోజు తీసుకుని వెళ్లి తీసుకుని రావాలి అంటే తానే వెళ్ళాలి. కానీ భర్త తనను ఇంట్లో నుండి బయటకు వెళ్లనిచ్చేవాడు కాదు. అందువల్ల ఆ టైం కి మామగారినో మరిది గారినో బతిమాలి పంపేది.

కానీ అలా పంపడం వల్ల తానే తన కూతురు జీవితం లో నిప్పులు పోస్తుంది అని అనుకోలేక పోయింది. మనవరాలిని బడి నుండి తెచ్చే నెపంతో తాత ఆ పాప ను లైంగికంగా వేధించేవాడు.

అతను అలా చేస్తాడు అని వైష్ణవి అసలు ఊహించలేదు. అతని తర్వాత మరిది కూడా పాప ను ముద్దు చేసే నెపం తో పాప బుగ్గలు పిండడం, ఆమెను తన మధ్యలో కూర్చోబెట్టుకుని తన చంకల్లో చేతులు ముందుకు తెచ్చి గట్టిగా కౌగలించుకోవడం వంటివి చేసేవాడు.

అయితే వైష్ణవి అదంతా గమనించినా మొదట్లో ముద్దు చేస్తున్నాడు అనుకుంది. కానీ తర్వాత పాపకు స్నానం చేయించే టప్పుడు అసలు నిజం తెలుసుకుని బిత్తర పోయింది. మగాడు చేసే అకృత్యాలకు తన బిడ్డ బలి అవడం తట్టుకోలేక పోయింది.

పోనీ ఇంట్లో ఎవరికన్నా చెప్పాలి అంటే. అలా చెప్పడం వల్ల అందరికీ ఇంకా శత్రువుగా మారతాను అని పైగా ఎవరు తన మాటలు నమ్మరు అని తెలిసి, కొన్ని రోజులు భర్తతో కాపురం చేయకుండా, అన్నం తినకుండా నిరాహార దీక్ష లాంటిది చేసి భర్తను వేరే ఊరికి తీసుకుని వెళ్లి కాపురం పెట్టింది.

భర్త ఏ కళనున్నాడో కానీ తన భార్య చెప్పినట్టు విన్నాడు. కాపురం అయితే పెట్టారు కానీ బాధలు మాత్రం తప్పలేదు. అయినా అన్ని భరించి కాపురం చేసుకోసాగింది. ఆమె ఓపిక, సహనంతో భర్తలో మార్పు వచ్చింది. దాంతో ఉన్న ఇల్లునే కొన్నాడు. పిల్లలు పెద్దవారు అయ్యారు.

భర్త ఆమెను ఎంత కొట్టినా, తిట్టినా రాత్రి అయ్యేసరికి తన తో బాగానే ఉండేవాడు. కడుపు నిండా తిండి పెట్టేవాడు. కొట్టడం ఒక్కటే అతనికి ఉన్న వ్యసనం రాను రాను అది కూడా తగ్గించాడు. వయసు పెరిగే కొద్ది భార్య విలువ తెలిసి వచ్చింది అతనికి. దాంతో భార్యను ప్రేమగా చూసుకునేవాడు.

వైష్ణవి వయసులో ఉండగా ఎలాంటి తప్పులు చేయలేదు. పెళ్లి అయ్యాక భర్తనే అమితంగా ప్రేమించిన భర్త తో ఎల్లకాలం కలిసి ఉండాలని అనుకుంది. మారిన తన భర్తను చూసి సంతోషించింది.

కానీ మారిన అతను భార్యకు సరిగ్గా ప్రేమను పంచలేక పోతున్నా అనే బాధలో, అంతకు ముందు తాగిన వాడు అవటం చేత ఊపిరి తిత్తుల పాడయ్యి, నిద్రలోనే చనిపోయారు.

పాపం వైష్ణవి భర్త చనిపోవడంతో, అది జీర్ణించుకోలేక పోయింది. ఎందుకంటే పెళ్లి అయినప్పటి నుండి అతనే లోకంగా బతీకింది. అతను తన జతగాడు అనుకుంది. చనిపోయిన అతన్ని చూస్తూ అలాగే షాక్ లో ఉండిపోయింది.

అతను చనిపోయాడు అనే నిజాన్ని తట్టుకోలేక పోయింది. పిల్లలు, చుట్టాలు, బంధువులు అందరూ ఏడుస్తున్నా ఆమె కంటి వెంట ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. అది చూసి అంతా ఎన్నో మాటలు అన్నారు. ఎన్నెన్నో చివాట్లు పెట్టారు.

మొగుడు చస్తే ఎడవని పెళ్ళాన్ని ఎక్కడా చూడలేదు అంటూ ఎన్నెన్నో మాటలు అన్నారు. అయినా అందరి మాటలు విన్నా కూడా వైష్ణవి కట్లోంచి నీళ్ళు రాలేదు. ఎవరేం అనుకున్నా కూడా వైష్ణవి పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఎడవలేదు, నవ్వలేదు. నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. అప్పుడే కాదు తర్వాత కూడా ఏమీ మాట్లాడలేదు. 

*******

భర్త పోయిన తర్వాత మళ్లీ ఇంట్లో కి మీకు తోడుగా ఉంటాను అంటూ అందరూ ఇంట్లో చేరారు. భర్త పోయిన బాధలో ఉన్న ఆమె ఎవర్నీ ఏమీ అనలేదు. దాన్ని అలుసుగా తీసుకుని మామ, మరుదులు ఆమెను లైంగికంగా లొంగ దీసుకోవలని చాలా ప్రయత్నాలు చేశారు.

కానీ ఆమె మాట్లాడక పోయినా చూపులతో వారిని అడ్డుకుంది. ఆమెను ఏమీ చేయలేము అని తెలిసిన వాళ్లు ఇంకోరకంగా ఆమెను బాధ పెట్టాలని అనుకున్నారు.

నవీన ఇంటర్ లోకి వచ్చింది. పెద్ద పిల్లలు ఇద్దరు డిగ్రీ చేశారు. పెద్ద కొడుకు విక్రమ్ ప్రైవేట్ కంపెనీ లో జాయిన్ అయ్యాడు. రెండో వాడు మెడికల్ షాప్ లో పని చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇబ్బంది ఇంకో వైపు నుండి వచ్చింది.

ఇంట్లో ఉన్న పిల్లలు పొద్దున్నే డ్యూటీ లకు వెళ్లడం, వైష్ణవి పని చేసుకుంటూ ఉండడం నవీన ఒక్కతే టీవీ చూస్తున్న సమయం లో లేదా కాలేజీ నుండి వెళ్తున్న సమయంలో అయితే తాత, లేదంటే బాబాయి ఇద్దట్లో ఎవరో ఒకరు ఆమె వెంట వెళ్తూ ఆమెను తాకుతూ, ఆమెకు చాక్లెట్లు కొని పెడుతూ, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు.

వాళ్లు చేసే పిచ్చి పనులు చూస్తున్న నవీన కొన్ని రోజులు భయపడింది. ఎవరికీ చెప్తే ఏమంటారో అనుకుని ఎవరికీ చెప్పలేదు. నవీన చెప్పక పోవడంతో, వారిద్దరూ ఇంకా రెచ్చిపోయారు.

ఆమె బుగ్గలు గిల్లడం, చిన్నగా ముద్దు పెట్టుకోవడం, ఆమెను ఒళ్ళోకి లాగడలు చేశారు. ఇవన్నీ మౌనంగా భరిస్తూ ఉండేది నవీన. కానీ బయట పెట్టలేక పోయింది. భయపడింది.

కానీ ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వైష్ణవి మరిది అంటే నవీన బాబాయి తనను బలవంతం చేయ బోయాడు. నవీన వద్దు వద్దు అంటూ గింజుకో సాగింది.

అప్పుడే బయట నుండి వస్తున్న వైష్ణవి అది చూసి ఒక్కసారిగా బిత్తర పోయి తర్వాత తన కర్తవ్యం గుర్తొచ్చి, వంట గది లోకి వెళ్ళి కత్తి పీట తీసుకుని వచ్చి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వెళ్లి వాడి చెయ్యి కత్తి పీట తో ఒక్క వేటు వేసింది.

దాంతో వాడు ఏమైందో అర్దం కాక తన చేయి వైపు చూసుకుంటూ, వామ్మో, వాయ్యో, అమ్మో నా చేయి, అమ్మో నా చేయి అంటూ గిల గిలా తన్నుకుంటుంటే నవీన వచ్చి తల్లి వళ్ళో వాలిపోయింది.

అప్పుడే ఇంటికి వచ్చిన మామ అది చూసి అయ్యో కొడుకా ఏమైంది అంటూ ఓసి రాక్షసి నా కొడుకుని ఏం చేసావే అంటూ ముందుకు వచ్చాడు. దాంతో, వైష్ణవి కత్తి పీట ను ముందుకు జులిపించి చూసింది.

అది చూసి కొడుకు నాన్న నా చెయ్యి నాన్న అంటూ ఏడుస్తూ ఉంటే ముందుకు వెళ్ళిన తండ్రి వెనక్కి వచ్చి నిన్ను నిన్ను చంపేస్తానని బీరాలు పలుకుతూ ఉంటే గుడి నుండి వచ్చిన అత్త అయ్యో నా కొడుకా అంటూ చేయి తెగిన కొడుకు దగరికి వచ్చి ఏమయ్యింది అంటూ అడిగింది.

అప్పుడు నోరు తెరిచింది వైష్ణవి. నీ మొగుడు, నీ కొడుకు ఇద్దరూ నా కూతురి పై చేయి వేశారు. ఇన్ని రోజులూ నాకు తాళి కట్టిన మొగుడు ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని గౌరవించి మీరేం అన్నా కూడా భరించాను. సహించాను.

అన్నిటికీ సహనం తో ఉన్నాను. కానీ ఇప్పుడు నా భర్త లేడు అయినా మీరంతా నా కొడుకుల సంపాదన మీద పడి తింటూ ఉన్నా ఏమీ అనలేదు ఎందుకంటే పెద్ద దిక్కుగా ఉంటారు అని కానీ ఇప్పుడా పెద్ద దిక్కు నా కూతుర్ని కబళించాలని చూస్తే చూస్తూ ఉరుకుంటాని ఎలా అనుకుంటారు.

అందుకే చేయి నరికేశాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నా జోలికి నా పిల్లల జోలికి వస్తె ఎవర్నీ వదలను. నా భర్తనే పోయాడు ఇంకా మీరెందుకు నాకు నాకు మీరెవరు అవసరం లేదు వెళ్లండి నా ఇంట్లోంచి…

ఇప్పుడే కాదు ఇంకెప్పుడు నా కుటుంబం వైపు కన్నెత్తి చూసారో మీ ప్రాణాలు తీస్తాను అని అనేసరికి ఇన్ని రోజులు ఒక్క మాట కూడా మాట్లాడని కోడలి మాటలు విన్న అత్త తన భర్త కొడుకు చేసిన పనికి మొదట బిత్తరపోయి తర్వాత ఇలాంటి నిచుడినా నేను కన్నది అనుకుంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ బట్టలు అవి ఉన్న బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది.

అయితే వైష్ణవి మామ గారు మాత్రం ఇది నా కొడుకు ఇల్లు మేము ఇక్కడే ఉంటాం నువ్వేం చేస్తావ్ అంటున్న సమయంలో అత్తగారు వచ్చి చాల్లెండి నోరు మూసుకుని పదండి అంటూ భర్త చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళింది.

వెళ్తున్న వారిని చూస్తూ వైష్ణవి కి నవ్వు వచ్చింది. దాంతో ఇన్నాళ్లు నవ్వని తల్లి ఇప్పుడు నవ్వడం చూస్తూ మైమరచి పోయారు అప్పుడే ఇంటికి వచ్చిన పిల్లలు.. ఇన్నాళ్లకు అమ్మ నవ్వింది.. అవును అమ్మ నవ్వింది తన కూతురిని కాపాడుకున్న అమ్మ నవ్వింది.

ఇన్ని రోజులూ మూగ బోయిన మాట మళ్లీ వచ్చింది. అమ్మ నవ్వింది. కబంధ హస్తాల్లో లోంచి బయట పడిన అమ్మ నవ్వింది. అయిపోయింది…

– అర్చన

0 Replies to “అమ్మ నవ్వింది”

  1. అమ్మ ఎంతయినా అమ్మే కదా. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఉండదేమో.

  2. కథ బావుంది కాని ఇతరులకు చెప్పినట్లుగా ఉంది, కథ జరుగుతున్నట్లు వ్రాస్తే ఇంకా రక్తి కట్టేది, అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *