అమ్మ
కనిపించే ఆ దైవం అమ్మ
కని పెంచే దాతృత్వం అమ్మ
తొలి గురువు అమ్మ
స్వర నాదం అమ్మ
జన్మజన్మల అనుభందం అమ్మ
అనుభూతుల అనురాగం అమ్మ
మమతల మల్లెలు అమ్మ
తియ్యని మకరందం అమ్మ
కలతలులేని కంచుకోట అమ్మ
కరుణ చూపేకామితం అమ్మ
కమ్మని మమతల కోవెల అమ్మ
గుప్పెడు ఆశల చప్పుడు అమ్మ
రంగుల హరివిల్లు అమ్మ
కమ్మని రుచుల కారుణ్యం అమ్మ
నవరసాల నవనీతం అమ్మ
మనసున్న మాణిక్యం అమ్మ
విరిసిన పూతోటా అమ్మ
చిరు ఆశల సుమమాల అమ్మ
మంచిని చూపే మార్గదర్శి అమ్మ
వెలుగునిచ్చే జ్ఞాన ధాత అమ్మ
కలబోసిన కనకధారా అమ్మ
నిను మెచ్చే వరమిచ్చే
ఆ దైవం అమ్మ
వెలలేని దీవెన అమ్మ
కొనలేని గ్రంధం అమ్మా
అమ్మంటే అంతులేని
సంతోషం అందరికీ ……
– జి జయ