అలనాటి చేతిరాత
నాటి చేతికి రాత
అలనాటి చేతికి రాత
వాతకాని రాత
నా దేవుని విధి రాత
సత్యముండగలదు
ధర్మమెలగ గలదు
శాంతి కాన గలదు
శుభములు ఎరుక గలరు
కక్షలన్నీ లేకుండా
కర్మలన్నీ విధి అయిన
కుచేలుడికి కు సైతం
శ్రీకృష్ణుని కనికరం
నేడు ఎచ్చట కలదు
నాటి రోజులు లేవు
మిత్రుత్వము శత్రుత్వం
చేసుకునే రోజులు విడ్డూరం
దేవుడంటే శిక్షలు
మూఢనమ్మకాల తల రాతలు
విడుచుకుంటే మంచిది
మూఢనమ్మకాలు వదిలి వస్తే
కులమతాలను విడిచి వస్తే
అలనాటి చేతిరాత నాటి నేటి చేతిరాత అని కానగలం
దేవుడు మన తల రాత రాస్తే
కవులు పుస్తకాల మీద రాస్తే
అభ్యుదయము హృదయ పటము నే మార్చగలదు
మరచిపోకు మిత్రమా
నా గుండెల సవ్వడి
నా యద ఒరవడి
నా కలం రాతలు
నా చేతి అభ్యుదయములు
ఇది మార్చలేను
ఈ సమాజాన్ని మార్చగలను..!
-యడ్ల శ్రీనివాసరావు