అలనాటి – నేటి రాతలు

అలనాటి – నేటి రాతలు

 సిరానింపి పాళీతో పరుగులుతీసే
అక్షరాల అల్లిక జిగిబిగి
పామరులకు పాడింత్యం చేరువచేసే
పురాణాల నాటి వైభవం

తాటాకు రేకులదే వైభవమంతా
ఘంటంతో లిఖియించేనంటా
పండితుల విజ్ఞానపు గని
హైoదవ సంస్కృతికిది మార్గం

ముందుతరాలకు మార్గం చూపే అక్షర నిధి
అక్షరానికి పట్టాభిషేకంచేసే పెన్నిధి

నేడెంతో పురోగాభివృద్ధి
అక్షర శిల్పాన్ని చెక్కె కొత్తనీరు
సాoకేతికత అందిపుచ్చుకున్న రాత
అక్షరానికి అందుబాటులో అభివృద్ధి బాట

ఊహలు నిముషంలో అక్షరరూపం దాల్చే
సామాజికత మేలుకోరు రచనలకు
కాలంచెల్లే నేటిరాత అమావాస్య చందురుడే
సన్మానానికి తప్ప ప్రయోజనకారి కానీ రాత

అందరిలో కొందరు మహానుభావులు
ఇంకా నిల్పే నాటి రచనా వైభవాన్ని
అలనాటి రాత ప్రకృతిలా విరబూసే
నేటిరాతలలో కొన్నే చేరే చిరస్థాయికి

 

-వింజరపుశిరీష

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *