ఆకలిరాజ్యం
అన్నమో రామచంద్ర అంటూ అరిచే ప్రాణాలెన్నో.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ చాటే వేదాలెన్నో..
ఆకలి విలువ
ఆకలి అవసరత,
ఆకలి పరిస్థితి ల వివరం వర్ణణాతీతం..
ఆకలి పై విజయం ఒకరిది..
ఆకలి పై చిన్న చూపు మరొకరిది..
అంతటి దీనస్థితి కి కారణమెవ్వరిది..
కాలం మారింది..
కారణం కుడా మారింది..
అంతా స్వార్ధం ఆవరించింది..
మనసు మానవ సేవ ను మరచింది.
అది కేవలం ధనాపేక్ష ను వరించింది..
మాయల ముసుగులో తరించింది..
అంతట ఇలా ఆకలి రాజ్యం అవతరించింది..
కారణం ఏదైనా.. కారకులు ఎవరైనా..
మారాలి సమాజం..
సమసిపోవాలి ఆకలి రాజ్యం..
– కిరీటి పుత్ర రామకూరి