తిరుమల గీతావళి
పల్లవి
ఏడుకొండల వెంకటేశుడా
కోరికలన్నీ తీర్చెడివాడా
ఆపదమొక్కుల శ్రీనివాసుడా
ఆదుకునేందుకు వేగమేరావా
చరణం
పూజలు ఆచారములే తెలియవు
తెలిసినదొకటే నీ నాముముగా
నీ తలపులతోనే మదినిండెనుగా
తరలివచ్చేటి స్వామివి నీవని
భక్తితోడనే నిను కొలిచేము
చరణం
నీ నామస్మరణయె మము కాపాడును
నీ పాదస్పర్శయే పొందిన చాలును
గోవిందాయని పలికెదమయ్యా
ఏడుకొండలను దర్శించినచో
మరుజన్మన్నది లేనేలేదుగ
మా చిత్తములోన నిన్నే నిలిపి
నిరతము నిన్నే కొలిచెదమయ్యా
చరణం
మాపై నీ కరుణను చూపి
మము రక్షించగ రావయదేవా
ఆకలి బాధలు అన్నీ మరచి
నీ సేవన మేము తరియించెదము
– సి.యస్.రాంబాబు