అడవి
ఆ.వె
1) అడవులనగ చెట్లు.ఆదిమానవులకు
స్థావరముగ నుండి తల్లి వోలె
ఆకు.దుంప.పండ్లు అన్నమై సాకెను
అడవి నదులు నీటి నందజేసె
ఆ.వె
2) అడవి నుండి మనకు ఆహారమే గాక
అన్ని ఔషధములు అందుచుండె
ప్రకృతి సహజమైన పరిసరమ్ములవల్ల
ఆశ్రమాలు వెలసె అడవులందు
ఆ.వె.
3) ఇంటి కొక్క చెట్టు ఇష్టమ్ముతో నాట
కంటికింపు గూర్చు కలుషమడచు
జీవనమ్ములిచ్చు జీవితాధారమ్ము
అడవి నరుకు వారి నడ్డుకొనుడు
– కోట