ఆడవారు అలిగితే…

ఆడవారు అలిగితే…

ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు రాము అలసిపోయి.

ఏమే కాసిన్ని మంచినీళ్లు ఇయ్యవే.

భార్య లత పలకలేదు.. ఫోన్ లో వాళ్ళ అమ్మ తో మాట్లాడుతూ ఉంటుంది…

రాము: ఎం చేస్తుంది ఇది. అలసిపోయి ఇంటికి వస్తే రాగానే కాసిన్ని మంచి నీళ్ళు గానీ, కాఫీ గానీ నా మోహన కొడదాము అని లేదు.. అంటాడు. చిరాగ్గా…

కాసేపు అయ్యాక.. ఎంటి ఇది ఇంకా పలకదు.. ఎం చేస్తుంది అని రూం లోకి వెళ్తాడు..

లత సరదాగ మాట్లాడుతూ ఉంటుంది..

రాము: ఏమే లత…. లత….
లత: హ వచ్చారా రండి ఎంత సేపు అయ్యింది.. ఉండండి.. కాఫీ తీసుకు వస్తా అంటూ కిచెన్ లోకి వెళ్తుంది..
రాము: ఏమిటో ఇది అర్థమే కాదు… వచ్చి ఇంతసేపు అయిన పట్టించుకోలేదు… ఇపుడు కాఫీ అంటూ వెళ్తుంది.. చెప్పేది వినకుండా…
లత కిచెన్ లోకి వెళ్లి చూసి తన భర్త రాము దగ్గరికి వెళ్తుంది. 

లత: ఏవండీ ఏవండోయ్…కాఫీ తగారా మీరే పెట్టుకుని.. అంటూ….
రాము: చిరాగ్గా కోపం తో.. లేదు పక్కింటిది వచ్చి చేసి పెట్టింది.. అంటాడు విసుగుతో..

లత: ఏంటండీ అలా అంటారు.. నేనేం అన్నాను అని..

రాము: నువ్వు ఏమి అనవు. నువ్వు ఎందుకు అంటావు. ఎపుడు ఆ ఫోన్ పట్టుకుని కుర్చుంటావు..
అని కోపం తో … వెళ్ళు మీ ఇంటికి వెళ్ళి అక్కడే డైరెక్ట్ మాటలాడు.. అంటాడు..

లత: ఏంటండీ అలా అంటారు. నేనేం రోజూ మా అమ్మ తో ఉండడం లేదు కదా.. ఇలా ఫోన్ లో నే కదా మాట్లాడేది. అలా అంటే ఎలా అండి అంటుంది.

రాము: నేను ఆఫీస్ లో వర్క్ చూసుకొని అలసి పోయి వస్తా.. వచ్చినపుడు నాకేం కావాలి.. అని నాకు టీ లేదా కాఫీ ఇవ్వాలి అని తెలీదా.. అయిన రోజంతా ఎం చేస్తున్నావ్ అపుడు మాట్లాడొచ్చు కదా అంటాడు..

లత: ఏవండీ మీరు వెళ్లిన దగ్గరి నుండి ఏదో ఒక పని ఉంటుంది.. అమ్మ అనుకోకుండా కాల్ చేసింది.. మాట్లాడను.. ఇందులో తప్పేముంది మీరే కదా అర్దం చేసుకోవాలి అంటుంది…

రాము: ఏయ్ మాట్లాడకు ముందు ఇక్కడి నుండి వెళ్ళు… అంటాడు..

లత: ఏడుస్తూ వెళ్ళి కూర్చుంటుంది .

అలా నైట్ డిన్నర్ టైం అవుతుంది.. రాము అన్న మాటలు తలచుకుని ఏడుస్తూ కూర్చుంటుంది లతా…

రాము: లత… లత.. ఎంటి నువు టైం చూసావా అన్నం పెట్టాలి అని తెలీదా… అంటూ వస్తాడు .

లత పలకదు.

రాము కిచెన్ లోకి వెళ్లి చూస్తాడు కోపం తో అన్నం పెట్టుకుంటాడు…

అప్పటికి లత కూడా తినలేదు…

ప్లేట్ లో అన్నం పెట్టుకుని వెళ్తాడు లత దగ్గరికి..

లత.. లత…

హ్మ్ అంటుంది.. మౌనంగా..

ఏంటే అన్నం తిందాం అని టైం కి నువ్వే కదే రోజు వచ్చి పెడతావు.. ఈరోజు ఏమైంది.. అంటాడు..
లత బాధతో మౌనంగా ఉంటుంది..

రాము: ఏదో చిరాగ్గా కోపం లో ఏదో టెన్షన్ లో అలా అరిచేసాను.. ఈ మాత్రం దానికి ఇంత సేపు అదే ఆలోచిస్తూ బాధ పడాల… బుజ్జి కోపం అయిన ప్రేమ అయిన నీ మీదే కదరా చూపించేది నేను మాత్రం ఇంకెవరి మీద చూపిస్తా.. నువు ఇలా అలిగి అన్నం తినకుండా ఉంటే ఎలా చెప్పు.. అని అన్నం ముద్దలు కలిపి తినిపిస్తాడు….

మగవారు వారి కోపం ఎవరి మీద చూపించాలో అర్దం కాక బయటి.. ప్రేస్టేషన్ అంతా ఇంట్లో ఆడవారి మీద చూపిస్తారు… అంత మాత్రం దానికి బాధ పడితే ఎలా.. అలక ఎలా ఉండాలి అంటే… అలిగిన వెంటనే భర్త బుజ్జగిస్తూ మురిసిపోయి కరిగిపోయేలా ఉండాలి…

మీరు కూడా మగ వారు… ఇంట్లో ఆడవారు ఒక్కరే ఉంటారు. మీరు వెళ్ళిన దగ్గరి నుండి ఇంట్లో పనులు పూర్తి చేసుకొని మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు… అలాంటిది మీరు వచ్చి రాగానే.. ఇంట్లో ఉన్న వారి మీద కొప్పడుతే ఎవరికి చెప్పుకోవాలి..

అర్దం చేసుకోండి.. అందరూ..

– వనిత రెడ్డీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *