ఆదర్శనీయురాలు అమ్మ

ఆదర్శనీయురాలు అమ్మ

 

భూమి మీద మొదట స్త్రీ
కళ్ళు తిరగని జన్మనిచ్చేది స్త్రీ
ఆలయ గర్భగుడిలో దేవతతో సమానం స్త్రీ
బిడ్డ ఆయువు పట్టు తెలుసుకొనగలిగేది స్త్రీ మూర్తి
తన రక్తాన్ని పణంగా పెట్టి
తన ఆయువును ధారపోసి
అరచేతితో ఓనమాలు నేర్పి
ఆది గురువు అమ్మ
ఆది దైవం కూడా అమ్మ
అమ్మను మించిన దైవం లేనే లేరు
భర్త కన్న బిడ్డకి ఎక్కువ విలువ ఇచ్చేది మాతృమూర్తి
బిడ్డ ఏడిస్తే చూడలేదు అమ్మ
అక్షరాలు నేర్పినప్పుడు సరస్వతి
పాలించేటప్పుడు పార్వతి
ఖర్చు పెట్టేటప్పుడు ధనలక్ష్మి
అష్టలక్ష్మిలు కలదు ఆదిదేవత అమ్మ
ఐశ్వర్య లక్ష్మి , సంతాన లక్ష్మి బిడ్డను కంటుంది
ధైర్య లక్ష్మి తండ్రి కొట్టకుండా కాపాడుతుంది
అమ్మను మించిన దైవం లేనే లేదు
సృష్టిలో మొదటి దేవత అమ్మ
తెలుసుకుంటే జన్మ ధన్యం

– యడ్ల శ్రీనివాసరావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *