అబ్బి ఆశ!!
కొమ్మపై నీ కునుకులు ఆపవమ్మా
నా పలుకులు వినవమ్మా
ఓ, చిట్టి చిలకమ్మా…….!
ఆ గుమ్మ నీ మాదిరే
అందమైన జాబిలమ్మే!
గుమ్మము ఎదురే గాని
గమ్ముగ నుండును మహా గడుసే ..!
నా ప్రేమ వయస్సు ఒక దినమే,
ఈరోజుకి అది నిన్ననే,
నేర్పించ వే ఒక లవ్లీ పాట
దాన్ని ఎత్తుకుని ముద్దాడుదునే…!
అది ఆకుపచ్చని చీర కట్టెనే,
సున్నమాయెను నా మనసు.
పండునో లేదో నా ప్రేమ
యెట్లు తెలుసునే??
నీ ఒక్కపలుకే మమ్ము
ఒకటిచేయునే…….!
నిన్న రాత్రి నిద్ర లేదే!
ఎర్రగ పండెను నా కళ్ళు.
పండించ వే నా ప్రేమని
నీకిస్తును కోట్ల తాంబూలం!
– వాసు