ఆకు + ముల్లు = అద్వైత పార్ట్ 1

 

ఆకు + ముల్లు = అద్వైత పార్ట్ 1

 

ఆకు + ముల్లు = అద్వైత పార్ట్ 1

 

ఏంటే ఇంతగా రెడీ అవుతున్నావు అడిగింది లత. నా కోసం జగన్ వెయిటింగ్ అక్కడ అందుకే రెడీ అవుతున్నా అంది అద్వైత. ఏంటే అద్వి ఇది? వాడేమో ఏమీ చదువుకున్న వాడు కాదు, వాడిని నమ్మి నువ్వెలా వెళ్తావు?

అసలు వాడి లో ఏం చూసి ప్రేమించావు? వాడు మెకానిక్ షాప్ నడిపే వాడు. వాడికి ఎలా పడ్డావే నువ్వు అంది లత నెత్తి కొట్టుకుంటూ, దానికి అద్వైత, వాడు మెకానిక్ అయినా మంచి వాడే చాలా బాగుంటాడు. అందం చూసి ప్రేమ పుట్టదు లత, మంచి గుణాలు చూసి పుడుతుంది.

అయినా నీకేం తెలుసు ప్రేమ గురించి, ఒక్కసారి ప్రేమలో పడి చూడు అర్దం అవుతుంది అంది. నీ మొహం ఇక్కడికి మనం చదువుకోవడానికి వచ్చాము కానీ, ఇలా ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి కాదు అంది లత.

సరే సరే నీతో వాదించడానికి నాకు టైం లేదు వెళ్తున్న అసలే జగన్ ఎదురుచూస్తూ ఉంటాడు. అంటూ చెప్పులు వేసుకుని బయటకు నడిచింది అద్వైత.

నీకెంత చెప్పినా దండుగనే నువ్వు మైకంలో ఉన్నావు. మైకం దిగినప్పుడు నీకే అన్ని అర్థం అవుతాయి అంటూ నిట్టూర్చి, తాను రెడీ అవడానికి వెళ్ళింది లత.

********

హాల్లో బంగారం ఏంటి ఇంత లేట్, నీ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నాడు జగన్ అద్వి ను చూడగానే, ఏం చేయమంటావు జగన్ నేను వస్తూ ఉంటే లత క్లాస్ పీకడం మొదలు పెట్టింది. అందుకే కాస్త లేట్, అయినా మా అమ్మయిల కష్టాలు నీకేం తెలుసు లే అంది కోపం గా…

అబ్బో అమ్మాయి గారికి కోపం వస్తుందా, ఇప్పుడు నిన్ను బతిమాలను కానీ సినిమాకు టైం అవుతొంది రా, పద పద అసలే నీకు ఇష్టమైన హీరో సినిమా. మొదటి నుండి చూడాలి అంటావు కదా అంటూ లోపలికి దారి తీశాడు జగన్. హా సరే పద అంటూ ఇద్దరు వెళ్లారు.

హాల్లో అద్వైత సినిమా చూస్తుంటే జగన్ తనని చూడడం మొదలు పెట్టాడు. ఏంటి జగన్ సినిమా చూడు అంది, నో నేను నిన్నే చూస్తాను. నాకు నువ్వే ముఖ్యం అంటూ మెల్లిగా చేయి తీసుకుని నిమర సాగాడు.

అతను తాకగానే అద్వైత ఒళ్ళు ఝల్లుమంది, చేయి వెనక్కి లాగాలని అనుకుంది. ప్లీజ్ అద్వీ చేయే కదా అంటూ మెల్లిగా పామ సాగాడు.

అతని శరీరం వెడెక్క సాగింది. అద్వైతకు కూడా ఒంట్లో ఏదో అవ్వసాగింది. దానికి తోడు సినిమాలో మంచి రొమాంటిక్ సీన్స్ రావడం వల్ల ఇద్దర్లో ఏదో కావాలనే తపన, కోరిక మొదలయ్యాయి.

అది గమనించిన జగన్ అద్వైత చెవిలో రూమ్ కి వెళ్దామా అంటూ అడిగాడు. తనకు ఇంకేదో కావాలని అనిపించడంతో అద్వైత తల ఊపింది.

ఆమె నుంచి స్పందన తనకు అనుకూలంగా రావడంతో జగన్ కు హుషారు అనిపించి, దొరికిందే ఛాన్స్ అనుకుంటూ ఎవరికో ఫోన్ చేశాడు. అటు నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడం వల్ల ఇంకా ఆగలేక పద అంటూ సినిమా మధ్యలోంచి బయటకు నడిచారు ఇద్దరు.

కసాయి వెంట వెళ్లే మేక పిల్లలా, బలి కి రెడీ అయి వెళ్తున్న గొర్రెలా, అతని వెనకే బయలు దేరింది అద్వైత.

అమ్మాయిలకు ఎప్పుడు ఎవరి పైన ప్రేమ పుడుతుందో, ఎవర్నీ ఎక్కువగా నమ్ముతారో, తమ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టడానికి ఇష్టపడతారో, ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు.

కానీ ఇప్పుడు అద్వైత ఒక మెకానిక్ ని ప్రేమించి, అతన్ని నమ్మి వెళ్ళింది. మరి ఇక్కడ అద్వైత జీవితం ఎలా మారింది? తాను నమ్మిన వాడు ఏం చేశాడో తెలుసుకోవాలి అంటే  రెండో భాగం చదవాల్సిందే…. తరువాతి భాగం వచ్చే నెలలో….

– భవ్య చారు

0 Replies to “ఆకు + ముల్లు = అద్వైత పార్ట్ 1”

  1. ఇప్పుడు సమాజంలో జరిగే విషయాలను కధ రూపంలో చక్కగా మా ముందుకు తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *