ఆకతాయి జీవితం
తెలియని తపనల్లా తొలివెలుగులదో ఆశ
మూసిన కన్నుల మూగభాషలా
మనసుదో అయోమయం
వెలుగచుక్క నేలపై గీతలతో నవ్వుతుంది
ఆరని కుంపటిలా
ఆకతాయి జీవితం
ఆదేశాలు జారీచేస్తుంటే
ఆపదలన్నీ అటక దిగుతాయి
మంచి మిత్రుడి మాటను గుటకేసి
ఆవాహన చేయటంతో
మనసు అయోమయం ముక్కలవుతుంది.. తపనలన్నీ తన్మయత్వాలవుతాయి
కాలం ఉపిరి.. జ్ఞాపకాల సిరి
కలల రాతిరి.. వెతల ఉరి
పడిలేచే కెరటంలా మనుషులను
చుట్టేయమంటూ తొలివెలుగు
వళ్ళంతా పాకుతుంది
– సి. యస్ .రాంబాబు