ఆకలి
మధ్యతరగతి వారికి గౌరవం…
దిగువ మధ్యతరగతి వారికి పేదరికం…
మనిషికి విలువను నేర్పించే గొప్ప ఆయుధం…
మనిషి తిరుగుబాటును సూచించే సంకేతం…
వ్యయప్రయాసాల మధ్య సామాన్యుని జీవనం…
అల్లరిమూకల సమూహంలో యువతి రక్షణ…
మనిషిని మనిషిగా గుర్తించేది…
మనిషిని సమూహానికి దగ్గర చేసేది
మరియు దూరంగా విసిరేసేది…
మనిషి మరో మెట్టుకీ దిగజార్చేది…
మనిషిని మరో మెట్టు ఎక్కించేది…
– గోగుల నారాయణ